Puja Astro Tips: గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తూ అలాంటి పనులు చేస్తున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు?

మామూలుగా చాలామంది పూజ చేసేటప్పుడు, పూజ చేసిన తర్వాత అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇలా చాలా సందర్భాలలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు

  • Written By:
  • Updated On - February 12, 2024 / 10:03 PM IST

మామూలుగా చాలామంది పూజ చేసేటప్పుడు, పూజ చేసిన తర్వాత అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇలా చాలా సందర్భాలలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో దేవాలయాలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చేసే పనులు కూడా ఒకటి. అలా గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తువు కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదట. ఇంతకీ ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజలు చేసే సమయంలో తప్పులు చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడనీ, మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. ఇంట్లో పూజ చేయడంతో పాటు కొంతమంది గుడికి వెళ్లి పూజను కూడా చేస్తారు. అలా గుడిలో పూజ చేసి వచ్చేటపుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

మరి ఆలయంలో పూజ చేసి వస్తూ చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.. మాములుగా ఎవరైనా సరే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకుని వెళ్లి, పూజ, ప్రసాద వితరణ అనంతరం ఆ ప్రసాదం ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో కొన్ని విషయాలను పాటించాలి. గుడి నుండి ఇంటికి తిరుగు ప్రయాణంలో ఎప్పుడూ ప్రసాదాన్ని తినరాదు. ఇలా చేయడం వలన ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఆలయం నుండి స్వీకరించిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రసాదంతో కలిపి కుటుంబ సభ్యులందరికీ పంచి, కలిసి సేవించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుడికి వెళ్లేటప్పుడు లేదా వచ్చే సమయంలో ఖాళీ పాత్రను ఇంటి నుంచి తీసుకుని వెళ్ళరాదు. అదే విధంగా గుడి నుంచి ఇంటికి తీసుకురాకూడదు.

ఇంట్లోకి ఖాళీ పంచ పాత్రను తీసుకురావడం వల్ల జీవితంలో చేసే పని కూడా చెడిపోతుందని నమ్ముతారు. కనుక దేవుడికి నీరుని సమర్పించే ముందు పాత్రలోని కొంచెం నీరు ఉంచాలి. లేదా నీరు అందుబాటులో లేనట్లయితే గుడి నుండి తెచ్చే పూజ పుష్పాలను పాత్రలో ఉంచవచ్చు. గుడి నుంచి వచ్చే సమయంలో పంచ పాత్ర నిండుగా నీరు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, సిరి సంపదలు లభిస్తాయి. అలాగే గుడిలో లేదా ఇంట్లో పూజ చేసే సమయంలో వెలిగించిన దీపంతో మరో దీపాన్ని వెలిగించకూడదు. ఇలా చేయడం వలన దేవుడికి కోపం వస్తుందట. అంతేకాదు పూజ ఫలం లభించదు. పూజ సమయంలో దేవునికి ఏ పూజా సామాగ్రిని సమర్పించాలనుకున్నా, నేలపై పడిన ఏ వస్తువునైనా తిరిగి దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వలన భగవంతుడిని అగౌరవ పరిచినట్లు పరిగణిస్తారు. అలాగే పూజ చేసేటప్పుడు, పూజా స్థలంలో పూజ సామగ్రి ఉన్న సమయంలో అక్కడ శుభ్రం చేయకూడదు.ఇలా చేయడం వల్ల దేవునికి అసంతృప్తి కలుగుతుందీ. ఆ పూజ కూడా పరిపూర్ణం కాదు.