Donate: పొరపాటున కూడా దానం చేయకూడని వస్తువులు.. అవేంటంటే?

సాధారణంగా దానాలలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్ర దానం, వస్తుదానం ఇలా అనేక రకాల

  • Written By:
  • Publish Date - March 7, 2023 / 06:00 AM IST

సాధారణంగా దానాలలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్ర దానం, వస్తుదానం ఇలా అనేక రకాల దానాలు ఉన్నాయి. ప్రతి మనిషి కూడా వారికి నచ్చినది దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఎదుటి వ్యక్తికి ధనం ధాన్యం వస్తువు ఏదో ఒక రూపంలో దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక రోజులలో దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వారు వారి స్తోమతకు తగ్గట్టుగా దానం చేస్తూ ఉంటారు. అయితే దానం చేయడం మంచిదే కానీ అందులో కొన్ని రకాల వస్తువులను దానం చేయడం అంత మంచిది కాదు.

అయితే ఇవ్వాల్సినవి కాకుండా ఇవ్వకూడనివి ఇస్తే మాత్రం ఫలితాలు తారుమారు అవ్వడంతో పాటు దానం చేసిన వ్యక్తులు ఇబ్బంది పడకతప్పదు. మంచి సంపదకు దేవత గా భావిస్తారు. ఇంట్లో లక్ష్మీ ఉంటే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాం. అలాంటి లక్ష్మీదేవి మత ఫోటో ఇతరులకు దానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీ ఇంటిని వదిలి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవి, గణేశుడు చిత్రించిన వెండి నాణేలను ఎప్పుడు ఇతరులకు దానం చేయకూడదు. సంపన్నులకు ఎప్పుడు పాత్రల దానం చేయకూడదు.

ఆ వ్యక్తులకు పాత్రలు దానం చేయడం వల్ల వాళ్ళు ఆ పాత్రలను ఎప్పుడు వాడరు. ఈ కారణంగా విరాళానికి ఎలాంటి ప్రాధాన్యత వుండదు. పాత్రలు దానం చేయాలి అనుకుంటే అవసరమైన వ్యక్తులకే దానం చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో సుఖ, సంతోషాలు కలగాలి అంటే ధార్మిక పుస్తకాలను ఇతరులకు దానం చేయాలి. మతం పట్ల అవగాహన లేని వ్యక్తులు ఎప్పుడు మత పుస్తకాలు దానం చేయకూడదు. అలా చేయడం వల్ల ఎప్పటికి దాన ఫలం లభించదు. ఇలాంటి దానాలు చేయడం ద్వారా ఎప్పటికి ఫలితం వుండదు.