Ashadha 2024: ఆషాడ మాసంలో ఈ చెట్టును పూజిస్తే చాలు.. అంతా విజయమే!

ఈ ఏడాది ఆషాడమాసం మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. వర్షాకాలం రాగానే వచ్చే మాసం ఇది. ఈ మాసంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ ఆ

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 10:30 AM IST

ఈ ఏడాది ఆషాడమాసం మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. వర్షాకాలం రాగానే వచ్చే మాసం ఇది. ఈ మాసంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ ఆషాడ మాసాన్ని విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ మాసం ఆ విష్ణుమూర్తిని ఏ అవతారంలో పూజించినా మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు ఈ మాసంలో ఎలాంటి దానదర్మాలు చేసినా శుభం జరుగుతుందని కూడా నమ్ముతారు. కొన్ని రకాల పనులు చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. కానీ ఈ ఆషాడ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. మరి ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన నవవధువు ఆమె ఇంట్లో ఉండకూడదని అంటూ ఉంటారు.

అలాగే ఈ ఆషాడ మాసంలో కొన్ని రకాలు పూజలు ముఖ్యంగా అరటి చెట్టును పూజించడం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోతాయి. విజయం కోసం ఎధురుచూస్తున్న వారికి కూడా విజయం వరిస్తుందట. మరి ఆషాడ మాసంలో అరటి చెట్టును పూజించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా మొదట అరటి చెట్టును ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. ఆషాఢ మాసంలో ఏదైనా గురువారం రోజున అరటి చెట్టును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మీరు మీ సౌలభ్యం ప్రకారం సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా ఎంచుకోవచ్చు.
అరటి చెట్టును శుభ్రం చేసి దాని మూలాల్లోకి నీరు పోయాలి.

చెట్టు కొమ్మను గంగాజలంతో కడిగి తుడవాలి. కాండం మీద చందనం, పసుపు కలిపి పేస్ట్ చేసి ఆ కాండం మొదట్లో పూయాలి. చెట్టు ట్రంక్‌ పై 5 లేదా 7 సార్లు ఎర్రటి దారాన్ని కట్టాలి. తరువాత ముందుగా గణేశుడిని, విష్ణువును పూజించాలి. అప్పుడు అరటి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజించాలి. అనంతరం చెట్టుకు కాలానుగుణంగా పండ్లు, పువ్వులు, దీపాలను సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి కర్పూర హారతి చేయాలి. తరువాత కొబ్బరికాయ కొట్టి, తాంబూలం సమర్పించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించాలి. పూజ తరువాత, అరటి చెట్టుకు నీరు సమర్పించాలి.

ఈ విధంగా ఆషాడం మాసంలో అరటి మొక్కను పూజించడం వల్ల పుణ్యం లభించడంతోపాటు మీరు ఎటువంటి కార్యం మొదలుపెట్టినా కూడా మీకు అంతా విజయమే. ఎందుకంటే అరటి చెట్టు విష్ణువు చిహ్నంగా పరిగణిస్తారు. ఆషాఢమాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. హిందూమతంలో చెట్లను దేవతలకు నిలయంగా పరిగణిస్తారు. ఈ వృక్షాన్ని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఆషాఢమాసంలో గ్రహాల స్థానం శుభప్రదం. అరటి చెట్టును పూజించడం వల్ల గ్రహాల శుభాలు కలుగుతాయి. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలు లభిస్తాయి. కోరుకున్న విజయం కూడా వరిస్తుంది.