Site icon HashtagU Telugu

Lakshmi Devi: మీ ఇంట్లో ఇవి లేవా.. వెంటనే తెచ్చుకోండి.. లేదంటే లక్ష్మీదేవికి కోపం రావడం ఖాయం!

Lakshmi Devi

Lakshmi Devi

మామూలుగా ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండడంతో పాటు ఎల్లప్పుడూ లక్ష్మీ అనుగ్రహంతో ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలా కోరుకోవడం మంచిదే అయినప్పటికీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. మరి ముఖ్యంగా మన ఇంట్లోని వంట గదిలో కొన్ని రకాల వస్తువులు ఎప్పుడూ ఉండాలని చెబుతున్నారు. ఆ వస్తువులు నిండుకుంటే లక్ష్మీదేవికి కోపం రావడంతో పాటు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అందుకే వంట గదిలో తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు ఎప్పుడు స్టాక్ ఉండాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

పసుపు.. ప్రతి ఒక్కరి వంట గదిలో తప్పనిసరిగా పసుపు ఉండాల్సిందే. మన సంప్రదాయంలో పవిత్రమైన పదార్థంగా కూడా పసుపు గుర్తింపు పొందింది. ఇది శుభానికి, ఆరోగ్యానికి, సానుకూల శక్తికి సంకేతం అని చెబుతున్నారు. పసుపు వంటగదిలో పూర్తిగా అయిపోతే ఇంట్లో శుభ్రత తగ్గుతుందట. ఇది మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

అలాగే ఉప్పు లేకుండా చాలా వరకు వంటలు పూర్తి కావు. ఉప్పు లేకుండా కొన్ని రకాల వంటలు అస్సలు తినలేము. అదే విధంగా ఉప్పు జీవితంలో సత్సంబంధాలకు చిహ్నంగా పరిగణించబడుతుందట. ఇది కుటుంబ సంబంధాల్లో సన్నిహితతను సూచిస్తుందట. వంటగదిలో ఉప్పు లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అపార్థాలు మొదలవుతాయట. అందుకే ఉప్పు ఎప్పుడూ ఇంట్లో అయిపోకుండా చూసుకోవాలట.

అలాగే వంటగదిలో శుద్ధమైన నీరు ఉండేలా చూసుకోవాలట. నీరు జీవానికి కీలకం. నీటి కుండ లేకపోతే లేదా నీరు పూర్తిగా అయిపోతే అది జీవన సరళిలో ఇబ్బందులకు దారి తీస్తుందని కాబట్టి మంచి నీటి నిల్వ ఉండేలా జాగ్రత్త పడాలని చెబుతున్నారు.

ఇది ప్రతి ఇళ్లలో మౌలికంగా ఉండే ఆహారం బియ్యం. వంట గదిలో ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా బియ్యం తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకపోవడం పేదరికానికి సంకేతంగా భావిస్తారట. బియ్యం లక్ష్మీ దేవిని సూచించడమే కాకుండా శుక్ర గ్రహానికి కూడా సంబంధించినదని చెబుతున్నారు. వంటగదిలో బియ్యం పూర్తిగా అయిపోతుంటే ఆర్థిక ఇబ్బందులు రావచ్చట. అందువల్ల కొంతవరకూ నిల్వగా ఉంచుకోవడం అవసరం అని చెబుతున్నారు.

వంటగదిలో చక్కెర పూర్తిగా అయిపోతే ఇంట్లో మధురత తగ్గినట్టే అని చెబుతున్నారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందట. అందుకే ఇది ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

నెయ్యిని సంపద, శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇది శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం మాత్రమే కాకుండా మన ఇంటిలోని ఆర్థిక స్థిరత్వాన్ని సూచించేదట. ఇది లేనప్పుడు జీవితంలో పోరాటాలు ఎక్కువ అవుతాయట. ఈ పదార్థాలను వంటగదిలో ఎప్పటికీ పూర్తిగా అయిపోకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే మీ ఇంట్లో శుభం, ఆరోగ్యం, సంపద నిలకడగా ఉంటాయట.