Astrology : మంగళవారం పొరపాటున ఈ పనులు అసలు చేయకండి…లేదంటే కష్టాలపాలవుతారు..!!

వారంలో మూడవ రోజు మంగళవారం. దీనిని జయవారం అని కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, ఆంజనేయస్వామికి అంకితం చేసిన రోజు.

Published By: HashtagU Telugu Desk
IT raids telangana

money

వారంలో మూడవ రోజు మంగళవారం. దీనిని జయవారం అని కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, ఆంజనేయస్వామికి అంకితం చేసిన రోజు. మంగళవారం రోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం అనేది కుజ గ్రహానికి సంబంధించిన వారం. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే…ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేదంటే అంగారకుడి చెడు ద్రుష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడుతుంది. మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

అప్పు తీసుకోకండి
శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిగిరి చెల్లించడం కష్టం అవుతుందని మంగళవారం అప్పు పొరపాటున కూడా చేయోద్దు.

కొత్త బట్టలు కొనకూడదు
మంగళవారం నాడు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా ఈ సమయంలో ధరించకూడదు. ఎందుకంటే ఈ రోజు కొత్త బట్టలు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు. ఈ రోజు కొత్త బట్టలు ధరిస్తే…ఇతర కారణాల చేత ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించిన కొత్త వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తుంటారు.

అనారోగ్యంపై ప్రభావం
మంగళవారం ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంగళవారం మసాజ్ చేసుకుంటే తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి. ఫలితంగా ఎన్నో వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో చికాకులు కూడా మొదలవుతాయి.

హెయిర్ కట్
మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయవద్దు. ఎందుకంటే ఈ పనులు చేస్తే ఆయుష్షు తగ్గిపోతుందని చెబుతుంటారు. మంగళవారం షేవింగ్ చేయడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం

కొత్త షూస్ ధరించకూడదు
శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తువులతోపాటు కొత్త బూట్లను ధరించకూడదు. కొత్త బూట్లు వేసుకోవడం వల్ల గాయాలపాలవుతారు. అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉంటుందని భావిస్తారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్పమయ్యే అవకాశం ఉంటుంది.

పెద్దలు ఇలాంటి పద్దలు ఏదో బలమైన కారణం ఉంటేనే పెట్టారు ఊరికనే పెట్టరు కాబట్టి మనం తప్పకుండా ఆచరించాలి.

  Last Updated: 11 Jul 2022, 11:22 PM IST