Pooja Mistakes : దేవుడి విగ్రహాలకు పూజ చేస్తున్నారా, అయితే జాగ్రత్తలు పాటించకపోతే పుణ్యం బదులు పాపం తగిలే అవకాశం..!!

  • Written By:
  • Updated On - November 14, 2022 / 10:04 PM IST

చాలామంది ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. ఉదయం లేవగానే…స్నానమాచరించి..దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాతే మిగతా పనులను ప్రారంభిస్తారు. అయితే కొందరి ఇంట్లోని పూజగదిలో ఫొటోలు, విగ్రహాలు రెండు ఉంటాయి. భగవంతుడిని పూజించే ముందు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫొటోకు, విగ్రహానికి పూజ చేసే విధానంలో నియామాలు, పద్దతలు రెండూ కూడా విభిన్నంగా ఉంటాయి. అయితే చిత్రపటానికి, విగ్రహానికి పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. లేదంటే పుణ్యం బదులు పాపం తగిలే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

విగ్రహం, చిత్రపటం మధ్య తేడా:
విగ్రహారాధనను సిద్ధ ఆరాధన అని పిలుస్తారు. అయితే ఫోటో ఆరాధన అనేది మానస ఆరాధన రూపం. సిద్ధపూజ అంటే పూర్తి పద్ధతితో చేసే ఆరాధన అని అర్థం. మానస పూజ అంటే మనస్సుతో చేసే మానసిక ఆరాధన అని అర్థం.

విగ్రహ పూజ
1 . విగ్రహారాధనలో, ఒక ఆసనంపై కూర్చోవడం తప్పనిసరి. అయితే చిత్రపటానికి పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఎటువంటి పరిమితి లేదు.
2. విగ్రహారాధనలో అభిషేకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఫోటో పూజలో జలాభిషేకానికి స్థానం లేదు.
3. విగ్రహారాధనలో సాధన చేయడం ద్వారా మన కోరికను భగవంతుడికి తెలుపువచ్చు. అయితే చిత్ర పూజలో సాధన చేయడం సాధ్యం కాదు.
4, విగ్రహారాధనలో దేవతను ప్రతిష్టించిన తర్వాత మాత్రమే పూజించవచ్చు. అయితే చిత్ర పూజలో అలాంటి నిబంధనలు లేవు.

మూర్తి తస్వీర్ పూజ
1. విగ్రహారాధనలో, విగ్రహం పరిమాణం 3 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. చిత్ర పూజలో, దేవుని చిత్రాన్ని వీలైనంత పెద్దదిగా పెట్టుకోవచ్చు.
2. విగ్రహారాధనలో ఏదైనా దేవత బీజ్ మంత్రాలను జపించవచ్చు. అయితే ఫోటో ఆరాధనలో బీజ్ మంత్రాలను పఠించడం నిషేధం.
3. నిజానికి విగ్రహమైనా, చిత్రమైనా, స్నానం చేసిన తర్వాతనే పూజించాలి. అయితే కొన్ని ఆరోగ్య పరిస్థితులలో, చిత్రపటానికి పూజలో స్నానం మొదలైనవి చేయకపోయినా, అది ఇప్పటికీ పవిత్రంగా పరిగణిస్తారు. కానీ విగ్రహ పూజలో స్నానం చేయకుండా దేవుడి ముందు కూర్చోవడం ఖచ్చితంగా నిషేధం.

చిత్ర పూజ
విగ్రహారాధనలో, విగ్రహంలోని లోహం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే, విగ్రహం లోహం అష్టధాతువుతో లేదా బంగారు-వెండితో చేయాలి. అదే సమయంలో, చిత్ర పూజలో చిత్రపటంలోని లోహానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.