Site icon HashtagU Telugu

God Photos: పగిలిన పాత దేవుని పటాలకు పూజ చేస్తే ఇంటికి కీడు కలుగుతుందా?

God Photos

God Photos

సాధారణంగా చాలామంది ఇళ్లలో పూజ రూమ్ లో ఎక్కువ ఫోటోలు ఉంటాయి. కానీ ఇలా పూజ గదిలో ఎక్కువ ఫోటోలు ఉండకూడదు. పూర్వం మనకు ఒక సామెత ఉండేది. అదేమిటంటే నిత్య పూజారి పరమ దరిద్రుడు. అంటే నిత్యం దేవునికి పూజ చేస్తూ ఉండేవాడు దరిద్రుడితో సమానం. అలా ఎందుకు అంటే దేవుడికి కూడా ఎక్కువ పూజలు చేస్తే ఇష్టం ఉండదట. కాబట్టి దేవుని పూజ చేయాలి అనుకున్న వారు రోజుల్లో ఒక 40 నిమిషాలు స్వామికి కేటాయించి పూజ చేసుకుంటే సరిపోతుంది. పూజ చేసిన తర్వాత పని చేసుకోవాలి.

పనిచేసుకుంటూనే తినడానికి తిండి వస్తుంది కాబట్టి పూజా తర్వాత పని మీద శ్రద్ధ పెట్టాలి. అప్పుడే ఆ దేవుడిని చల్లని చూపు కూడా మీపై ఉంటుంది. అలాగే పూజ గదిలో కొన్ని రకాల దేవుడి పటాలను అస్సలు పెట్టకూడదు. కొందరి ఇళ్లల్లో దేవుడు పటాలు వంగిపోవడం, బూజు పట్టడం, లేదంటే అద్దాలు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అటువంటి దేవుడి పటాలను ఎప్పుడు ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు.

ఒకవేళ అలా బూజు పట్టిన, విరిగిపోయిన పటాలకు పూజ చేయడం వల్ల మీరు పూజ చేసిన ఫలితం దక్కకపోగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో పగిలిన ఫోటోలు ఉంటే వాటిని వెంటనే ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. పగిలిన దేవుడి ఫోటోలను ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం వల్ల కీడు కలుగుతుంది. అటువంటప్పుడు ఆ దేవుడి పటాలను వెంటనే తీసి ఎక్కడైనా పారె నీటిలో వేయడం మంచిది. అలాగే చాలామంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు.