Vastu tips : మీ ఇంటి నిర్మాణానికి ఈ చెట్లను ఉపయోగిస్తున్నారా?. అయితే ఆర్థికంగా నష్టంపోవడం ఖాయం..!!

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 07:03 PM IST

ఇల్లును నిర్మించాలంటే తప్పనిసరిగా చక్కటి వాస్తు ఉండాల్సిందే. వాస్తులో ఎలాంటి దోషాలు ఉన్నా…అది కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇల్లు కట్టేందుకు ఎంచుకున్న స్థలం నుంచి ఇంట్లో ఉండే ప్రతి చిన్న వస్తువు వరకు అన్నీ వాస్తు ప్రకారమే ఉన్నట్లయితే…ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటిఇంటీరియర్ డెకరేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిని కూడా వాస్తుప్రకారమే ఉండేలా చూస్తున్నారు. అయితే ఇంటికి కావాల్సిన కిటికీలు, డోర్లతోపాటు పలు రకాల వస్తువులను ఎలాంటి చెట్లతో తయారు చేసినవాటిని ఉపయోగించకూడదో తెలుసా. అలాంటి వాటిని చెట్లతో తయారు చేసిన వస్తువులను వాడినట్లయితే ఆర్థికంగా చాలా నష్టపోతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

పాలచెట్టు

మీరు ఇంటిని అందంగా అలంకరించుకునేందుకు సోఫాలు, కిటికీలు, డోర్లు ఇవన్నీ కూడా పాలచెట్టుతో తయారు చేసిన వాటిని ఊపయోగించకూడదు. మీరు చాలా చోట్ల పాలచెట్లను చూసి ఉండవచ్చు. వాటి కొమ్మలు, లేదా ఆకులను విరిచినప్పుడు వాటి నుంచి తెల్లటి అంటుకునే పదార్థం బయటకు వస్తుంది. వాస్తు ప్రకారం అలాంటి చెక్క కానీ చెక్కతో తయారు చేసిన వస్తువులను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు.

రబ్బరు చెట్టు.
రబ్బరు చెట్టు, అక్ చెట్టు ఈ రెండు చెట్లు కూడా ఈ తెల్లటి జిగురును విడుదల చేస్తాయి. పొరపాటునా ఇంట్లోకి ఆ చెట్టు కలప లేదా దాని తయారు చేసిన ఉత్పత్తులను తీసుకురావచ్చు. ఇలా చేస్తే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు.

శ్మశానంలో పెరుగుతున్న చెట్లు
శ్మశానంలో పెరుగుతున్న చెట్లను ఇంటి అవసరాలకు ఉపయోగించకూడదు. ఈ రకమైన చెట్లు ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తాయి. శ్మశానంలో పెంచే చెట్లు ఇంటి ఆర్థిక శ్రేయస్సును పాడు చేస్తాయి. శ్మశానవాటికలో చితి కాల్చేందుకు కూడా ఈ చెట్లను ఉపయోగించకూడదు.

పొడి చెట్టు
పొడిచెక్కతో తయారు చేసిన అలంకార వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. చెదపరుగులు ఉన్న కలపను కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇలా ఉంచితే ఇబ్బందులు ఎదురవుతాయి.