Head Bath: వారంలో ఆరోజు తల స్నానం చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు?

సాధారణంగా స్త్రీలు ఎక్కువ శాతం మంది శుక్రవారం రోజున తలస్నానం చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రో

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 08:10 PM IST

సాధారణంగా స్త్రీలు ఎక్కువ శాతం మంది శుక్రవారం రోజున తలస్నానం చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున తల స్నానం చేస్తే అమ్మవారికి పూజిస్తే అంతా మంచే జరుగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం అస్సలు తలంటు పోసుకోరాదు. మరి స్త్రీలు ఏ రోజు ఏ స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోమవారం తలంటు పోసుకుంటే నిత్య సౌభాగ్యం. మంగళవారం ఎట్టిపరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. బుధవారం తల స్నానం చేయడం భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గురువారం, శుక్రవారం కూడా తలస్నానం చేయకూడదు. శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే పండుగలు, నోములు, పూజలతో పాటూ స్త్రీలకు నెలసరి సమయంలోనూ ఏ రోజైనా స్నానం చేయొచ్చంటారు. కొందరు మంగళవారం, శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేసుకుని ఒక్కపూట భోజనం చేస్తుంటారు. అలాంటి వారు ఆ రోజుల్లో ఉదయం తలంటు పోసుకుని పూజచేస్తారు.

అయితే అప్పుడు కూడా తలకు స్నానం సరిపోతుంది తలంటు అవసరం లేదంటారు పండితులు. కాబట్టి మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకుని చేయాలి. తలస్నానం చేసిన రోజున ఎవరైనా ముత్తైదువు ఇంటికి వస్తే బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు ఇస్తే మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు శుక్రవారం, గురువారం రోజున తలస్నానం చేయకపోవడమే మంచిది. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే చేస్తే తప్పులేదు కానీ మిగతా రోజులలో ఆ రెండు రోజుల్లో స్నానం చేయకపోవడమే మంచిది అంటున్నారు పండితులు.