Hanuman కష్టాలతో సతమతమవుతున్నారా.. అయితే హనుమంతుని పూజించడంతోపాటు ఈ పరిహారాలు పాటించాల్సిందే?

ఆంజనేయ స్వామి (Hanuman)ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - November 20, 2023 / 04:20 PM IST

Worshiping Lord Hanuman : హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి (Hanuman) కూడా ఒకరు. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా ఉంటుంది. కాగా ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. కాగా ఆ సంగతి పక్కన పెడితే మీరు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఆంజనేయ స్వామి (Hanuman)ని ఈ విధంగా పూజించడం వల్ల కష్టాల నుంచి బయటపడవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ఆంజనేయ స్వామికి 41 రోజులపాటు నియమంగా పూజ చేయాలి. హనుమాన్ (Hanuman) ఆలయంలో ఉన్న రావి చెట్టుకు 11 సార్లు నిదానంగా నెమ్మదిగా తిరుగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. స్త్రీలకు మధ్యలో విరామం వచ్చినా కూడా ఆ తర్వాత రోజు నుంచి తిరిగి ప్రారంభించిన 41 రోజులు పూర్తి చేయాలి. అయితే స్వామి ముందు దీపాన్ని వెలిగించేటప్పుడు భూమిపై పెట్టకుండా రావి ఆకుపై పిండితో తయారు చేసిన దీపానికి పువ్వులు పసుపు కుంకుమతో అలంకరించి దీపాన్ని వెలిగించాలి. పిండితో చేసిన ప్రమిదలో కొంచం బెల్లం వేసి దానిపై వత్తి వేసి నునే పోసి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు ఆవనూనెతో దీపారాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఏదో ఒక అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడేవారు గోధుమలు తెల్ల నువ్వులు మినుములు, పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండిలా చేసి ఆ పిండితో దీపాన్ని తయారు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే వయసు మీద పడుతున్న కూడా వివాహం కాలేదని కలత చెందేవారు బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే కోరిన కోరికలు నెరవేరాలంటే బియ్యప్పిండి గోధుమపిండి సమానంగా తీసుకొని ప్రమిదలా చేసి దీపారాధన చేయాలి. భార్యాభర్తల మధ్య బంధం గట్టిగా ఉండాలి అంటే కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే, తరచూ గృహంలో స్పర్థలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నం అవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని యథాశక్తి శ్రీరామ నామ జపం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ పూజ చేస్తున్నన్ని రోజులు తల్లిదండ్రులకు అలాగే గోమాత ప్రదక్షిణ చేయడం తప్పనిసరి. అదేవిధంగా మూగజీవాలకు, పేదవారికి మీకు తోచినంత మీకు ఉన్నంతలో సహాయం చేయాలి.

Also Read:  Somnath Temple : సోమనాథ్ ఆలయంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా..?