Site icon HashtagU Telugu

Evil Eye: ‎నరదృష్టితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే కర్పూరంతో ఇలా చేయాల్సిందే!

Evil Eye

Evil Eye

Evil Eye: నరుల దృష్టికి నల్ల రాయి అయినా పగిలిపోతుంది అనే సామెతలు మనం వినే ఉంటాం. అంటే అలాంటి చూపులు ఉంటాయి అని అర్థం. కొందరు మనుషులు పక్క వారు ఎదగడం చూసి ఓర్చుకోలేరు. అలాంటప్పుడు దిష్టి కళ్ళు పెట్టారు అని అంటుంటారు. అయితే ఈ నరదృష్టి తగలకుండా ఇంటివద్ద అలాగే వ్యాపార స్థలాలలో నిమ్మకాయ మిరపకాయలు వంటివి కడుతూ ఉంటారు. కొన్నిసార్లు బూడిద గుమ్మడికాయ కూడా కడుతూ ఉంటారు.

‎అలాగే కొన్ని వింత వింత బొమ్మలు కూడా ఏలాడదీస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎన్ని చేసినా కూడా నరదృష్టి సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇలా నరదృష్టి సమస్యతో బాధపడేవారు కర్పూరంతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే నరదృష్టి సమస్య వదిలిపోతుంది అని ఇలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం కర్పూరంతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక కర్పూరం ముక్కని ఉంచి దానిని మీ ఇంట్లోనే ఉత్తరం దిశలో ఉంచాలి.

‎ఇలా పెట్టడం వల్ల వాస్తు దోషాల ప్రభావం తగ్గి గృహానికి అనుకూల శక్తి ఏర్పడుతుందట. రాత్రిళ్ళు పడుకునే ముందు ఆ కర్పూరాన్ని ఆవు నేతిలో పెట్టి ఉదయాన్నే ఆ కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వాలట. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీలు, నరదృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు. ధనం వృద్ధి చెందడంతో పాటు ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట. ఎప్పుడైనా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళితే వెళ్లిన పని విజయవంతం అవుతుంది అని చెబుతున్నారు. కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కర్పూరం వెదజల్లే సువాసన ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని విశ్వసిస్తారు.

Exit mobile version