Site icon HashtagU Telugu

‎Financial Problems: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే ఈ ఒక్క పరిహారం పాటిస్తే చాలు!

Financial Problems

Financial Problems

Financial Problems: ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగిలేకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. అయితే ఈ అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం కష్టపడటం మాత్రమే కాకుండా కొన్ని రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు అలాగే దానధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు.

‎కొన్ని కొన్నిసార్లు ఎన్ని పూజలు పరిహారాలు పాటించిన కూడా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం కష్టంగానే ఉంటుంది. అయితే సంపాదించిన డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా చూసి ఖర్చు చేసుకోవాలి. అలా పొదుపు చేస్తూ ఉండాలి. అయితే పొదుపు చేసిన కష్టపడి డబ్బు సంపాదించిన కూడా చేతిలో డబ్బులు మిగలడం లేదు అనుకున్న వారు కొన్ని రకాల పరిహారాలను పాటించాలని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఆర్థిక సమస్యతో సతమతమవుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటిస్తే తప్పకుండా డబ్బు సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.

‎ఇంతకీ ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏదైనా ఆలయంలో రావి చెట్టు కింద ఉన్న జంట జంట నాగుల విగ్రహాలను పూజించాలి. ఆ జంట నాగుల విగ్రహాలకు పాలాభిషేకం చేయాలి. పాలాభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రెండు జిల్లేడు ఆకులను తీసుకొని వాటిలో బెల్లం నైవేద్యంగా సమర్పించి, ఆకులను నాగుల విగ్రహాలకు తోక ఉన్న ప్రదేశంలో పెట్టాలి. అయితే ఈ పరిహారాన్ని 9 మంగళ వారాలపాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఈ పరిహారాన్ని 9 వారాలపాటు భక్తిశ్రద్ధలతో చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఇంట్లో అంతా మంచే జరుగుతుందని ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడటం ఖాయం అని చెబుతున్నారు.

Exit mobile version