ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలక పోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోంది అని చాలామంది తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఎంత సంపాదించినా కూడా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని, రోజుకి అప్పులు ఎక్కువ అవుతున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం.
అమ్మవారి అనుగ్రహం కలిగితే ఎంతటి బీదవాడు అయినా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందే. అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటుగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఎలా పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయాలట. 90 రోజులపాటు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి రోజు 108 సార్లు ప్రదక్షిణలు చేసి అర్చన చేయడం వల్ల తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
శ్రీకాళహస్తిలో మంగళవారం రోజు రాహుకేతువుల పూజ చేయించడం వల్ల కూడా అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. అదేవిధంగా 13 మంగళవారాలు లేదంటే 13 శుక్రవారాలు దుర్గాదేవి ఆలయంలో రాహుకాలం సమయంలో దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం గణపతిని 41 రోజులపాటు గరికతో పూజించడం వల్ల సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. శ్రావణ నక్షత్రం రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి తులసీదళాలు పూలతో అర్చన చేయించాలని చెబుతున్నారు. స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహ స్వామికి సహస్రనామార్చన చేయించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. వీటితోపాటు శుక్రవారం రోజుల్లో ఉప్పు దీపం వెలిగించడం వల్ల కూడా ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.