Site icon HashtagU Telugu

Copper Power : రాగి పాత్ర, రాగి సూర్యుడి ప్రతిమ.. ఎన్నో శుభాలు

Copper Power

Copper Power

Copper Power : మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారా?

ఇంట్లోని ప్రతికూల శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా ?

మిమ్మల్ని ఎవరూ గౌరవించడం లేదా ?

ఉద్యోగంలో, వ్యాపారంలో విజయం సాధించలేకపోతున్నారా ?

అయితే రాగి పాత్ర, రాగి సూర్యుడి ప్రతిమ గురించి తెలుసుకోండి.

రాగి పాత్రలో(Copper Power) నీళ్లను నింపి తల పక్కన పెట్టుకుని రాత్రి పడుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రలో చెడు కలలు వచ్చినా.. వాటి వల్ల నిద్రకు భంగం కలిగినా నీళ్లతో నిండిన రాగి పాత్రను తల పక్కన పెట్టుకొని పడుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల చెడు కలలు దూరమవుతాయి. ఎవరైనా మీ డబ్బుపై కన్నేసినట్లు మీకు అనిపిస్తే.. 40 రోజుల పాటు సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించండి. ధనస్సు, మీన రాశుల వారు రాగి పాత్రలో నీటిని తీసుకుని పీల చెట్టుకు సమర్పిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలోని సూర్యుడు, కుజుడు బలవంతులు అవుతారు. దీని వలన అన్ని పనులలో విజయం లభిస్తుంది. మీ ఇంట్లో ప్రతిరోజూ అపశ్రుతులు చోటు చేసుకుంటూ ఉంటే తులసి మొక్కకు రాగి పాత్రలో నీరు సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ఐశ్వర్యం తిరిగి వచ్చి ఆ కుటుంబం మొత్తం మీద విష్ణువు అనుగ్రహం ప్రసరిస్తుంది.

Also read : Sun Rise: రోజుకు 16 సార్లు సూర్యుడు ఉదయించే ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా?

రాగి సూర్యుడి ప్రతిమను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. దుష్టశక్తులను తొలగించే వాస్తు నివారణలలో దీన్ని ఒకటిగా పరిగణిస్తారు. రాగి సూర్యుడిని మీ ఇంటి గోడలపై నిర్దిష్ట దిశలో ఉంచాలి. రాగి సూర్యుడి ప్రతిమను ఇంట్లో ఉంచడం వల్ల మీకు ఇల్లు లేదా ఆఫీసులో తగిన గౌరవం లభిస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాగి సూర్యుడికి బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది.  రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడే ఛాన్స్ ఉంటుంది.

ఎక్కడ ఉంచాలంటే..

మీ ఇంట్లో కిటికీ లేదా తూర్పు దిశలోని గోడపై రాగి సూర్యుడి ప్రతిమను ఉంచాలి. ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే, తలుపు వెలుపల రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఆఫీసులో తూర్పు గోడపై రాగి సూర్యుడి ప్రతిమను వేలాడదీయడం వల్ల వ్యాపారంలో పురోగతి లభిస్తుంది.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.