Site icon HashtagU Telugu

Temple: ఆలయానికి వెళ్తున్నారా.. అయితే అలా అస్సలు చేయకండి?

Temple

Temple

మామూలుగా మనం గుళ్ళు గోపురాలకు వెళ్ళడం అన్నది సర్వసాధారణం. కొందరు బిజీబిజీ షెడ్యూల్ వల్ల కేవలం ఏదైనా పండుగలకు ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆలయాలకు వెళితే మరి కొందరుభక్తిపై సిద్ధం ఉన్నవాళ్లు తరచుగా గుడికి వెళుతూ ఉంటారు. ఆలయాలకు వెళ్లడం మంచిదే కానీ అక్కడ తెలిసి తెలియక కొన్ని రకాల పొరపాట్లను మాత్రం అస్సలు చేయకూడదు. చాలామంది ఆలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల పొరపాటు చేస్తూ ఉంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆలయంలోకి అడుగుపెట్టగానే చాలామంది ప్రదిక్షిణలు చేస్తారు.

కానీ అంతకన్నా ముందే దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేసి నిదానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి. అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజ స్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు. ముఖ్యంగా యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకుని, చెవికి తగిలించుకుని, అపసవ్యంగా వేసుకుని ఆలయంలోకి ప్రవేశించకూడదు. మనసునిండా ఆలోచనలతో దేవుడిని దర్శించుకోరాదు. మనకు ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మనసులో ఆ దేవుడిని స్పంరించుకుంటూ దర్శించుకోవాలి.

ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు. అదేవిదంగా దేవాలయంలో దేవుడికి వెనుకగా కూర్చోరాదు. దేవాలంలో స్వార్ధంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండ కూడదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి. సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు. మహిళల నుదిటన కుంకుమ బొట్టు ఉండాలి. జుట్టు విరబోసుకుని దేవాలయాలు దర్శించ కూడదు.  గుడిలో మొదట ధ్వజ స్థంబం శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేయాలి. గుళ్ళో గోమాత ఉంటే గ్రాసం ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో లింగం, నందికి మధ్యలో నడవకూడదు. శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. కానీ బయట చేయవచ్చు. దేవాలయంలో ప్రవేశించి భక్తితో ఏడవకూడదు. ఏడుస్తూ దేవుడిని స్తుతించకూడదు. గంజి పెట్టిన వస్త్రాలు వేసుకుని దేవుడిని దర్శించుకోకూడదు. ఖాళీ చేతులతో గుడిలోకి వెళ్లకూడదు.మాసిన, చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఉతికిన బట్టలే వేసుకోవాలి.