Site icon HashtagU Telugu

Ganesh: సోమ,శని వారాలలో గణపతిని ఇలా పూజిస్తే చాలు.. కష్టాలన్నీ మాయం?

Ganesh

Ganesh

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా మొదట విగ్నేశ్వరున్ని పూజించిన తర్వాత ఆ శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు. సకల దేవతాగణాలకు అధిపతి గణపతి. అలాంటి మహా శక్తి సంపన్నుడైన గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభాలు ప్రసాదిస్తాడు. అందుకే ఆయన్ను ఆదిదేవుడని అని పిలుస్తారు. కీర్తిని ప్రసాదించేవాడు, లాభాలను కలిగించువాడు కాబట్టి ఆయనను లక్మీగణపతిగా పిలుస్తారు. అయితే ఒకవేళ ఆ విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి.

గణేష్ ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. కనీసం మూడు గుంజీలు తీయాలి. వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని,కొబ్బరి పువ్వులను కానీ, వెలగ పుష్పాలను కానీ అలంకరణకోసం సమర్పించాలి. ఒకవేళ ఇవేవీ దొరకని పక్షంలో 21 గరిక గుచ్ఛాలను సమర్పించాలి. గరికతో వినాయకుడిని పూజిస్తే సమస్త దోషాలు, విఘ్నాలు తొలగిపోతాయి. గరిక సూర్యునికి కూడా ప్రీతికరం. కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. శనివారం వినాయకుడితో పాటూ శని దేవుడికి కూడా గరిక సమర్పిస్తే శనిదోషాలు తొలగిపోతాయి.

అలాగే నైవేద్యంగా చెరకు, వెలగకాయ, కొబ్బరిబోండాలను సమర్పించాలి. గణపయ్య ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణలు చేయాలి. వినాయకుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరినీళ్ళు, చెరకురసంతో అభిషేకం చేసినట్లైతే వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్నకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తెల్ల జిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడిని పూస్తే అత్యంత శీఘ్రంగా కోరిక కోరికలు నెరవేరుతాయి. వినాయకుడి తిథి అయిన చవితి, జన్మ నక్షత్రం హస్తా రోజు పార్వతీ తనయుడిని పూజిస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే సోమవారం రోజు వినాయకుడికి ప్రత్యేక పూజ చేస్తే సంతోషంగా ఉంటారు. హస్తానక్షత్రం, చవితిరోజు విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది.

Exit mobile version