Navagrahas : మీరు కూడా అలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే నవగ్రహాల ఆగ్రహానికి గురవ్వడం ఖాయం?

నవగ్రహాల సంచారం బాగున్నా, బాగోపోయినా కొన్ని పనులు చేసేవారిపై నవగ్రహాలు (Navagrahas) ఆగ్రహం వ్యక్తం చేస్తాయని చెబుతారు పండితులు.

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 06:20 PM IST

Navagrahas : మామూలుగా జాతకంలో గ్రహాల సంచారం సరిగా లేనప్పుడు అనేక రకాల ఇబ్బందులకు గురికాక తప్పదు. అయితే వాటి సంచారం బాగున్నా, బాగోపోయినా కొన్ని పనులు చేసేవారిపై నవగ్రహాలు (Navagrahas) ఆగ్రహం వ్యక్తం చేస్తాయని చెబుతారు పండితులు. మరి ఎటువంటి పనులు చేస్తే నవగ్రహాల (Navagrahas) ఆగ్రహానికి గురవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సూర్యుడు.. ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకునే సూర్య భగవానుడికి పితృ దేవతలను దూషిస్తే కోపం వస్తుంది. సూర్యుడికి పెద్దలను దూషిస్తే కోపం వస్తుంది. ఇలాంటి పనులు చేస్తే సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యంగా సూర్య దేవుని ఎదురుగా మల మూత్ర విసర్జన. దంతావధానం చేయకూడదు.

We’re Now on WhatsApp. Click to Join.

చంద్రుడు.. అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అని చెబుతారు. కాబట్టి అద్దంలో దిగంబరంంగా చూసుకోవడం, వెక్కిరించడం, వింతవింత హావభావాలు ప్రదర్శించడం లాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారట. కుజుడు.. ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే కుజుడికి కోపం వస్తుందట. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి మోసం జరిగితే కుజుడు ఆగ్రహానికి లోనవ్వడం ఖాయం. బుధుడు… కొందరు నోట్లో వేలు పెట్టుకోవడం లేదంటే ముక్కులో వేలు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వీటిని అవలక్షణాలు అని అంటారు. కొందరు చెవిలో కూడా వేలు పెట్టుకుని పదేపదే తిప్పుకుంటూ ఉంటారు. అటువంటివారు అంటే బుద్ధుడికి పరమ చిరాకట. అందులోనూ బుధవారం రోజు అలాంటి పనులు చేస్తే ఆయన అసహ్యించుకోవడంతోపాటు ఆయన ఆగ్రహానికి లోన ఒక తప్పదట.

గురువు.. దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి ఎవరైనా గురువుని కించపరిస్తే ఆగ్రహం చెందుతాడు. విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నతంగా తీర్చి దిద్దిన గురువుల పట్ల భక్తి, శ్రద్ధ ఉండాలి కానీ దూషించడం సరికాదు. కాబట్టి అలాంటి గురువుని కించపరిస్తే ఆగ్రహించే గురువు వారిని పూజించి గౌరవిస్తే మాత్రం అనుగ్రహిస్తాడట. శుక్రుడు.. అలాగే శుక్రుడికి బంధాల మధ్య వివాదాలంటే కోపం. ప్రేమ కారకుడిగా చెప్పే శుక్రుడు భార్య-భర్త మధ్య బంధం సరిగా లేకున్నా, ఒకర్నొకరు అగౌరవ పరుచుకున్నా అస్సలు నచ్చదట. మరీ ముఖ్యంగా శుచీ శుభ్రత లేని ఇల్లు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపై శుక్రుడు ఆగ్రహిస్తాడట. శని… మామూలుగా ఈ పేరు వింటేనే చాలామంది భయంతో వణికిపోతుంటారు.

ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో దశలో శని కారణంగా బాధపడని వారు ఉండరు. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని జీవితకాలంలో వీటినుంచి తప్పించుకోలేరు. అయితే ఎలాంటి శని బాధలు లేనివారు కూడా శని ఆగ్రహానికి గురవుతారు. వాళ్లు మరెవరో కాదు పెద్దల్ని కించపరిచేవారు, మురుగుదొడ్లు శుచిగా ఉంచనివారు, తల్లిదండ్రులను చులకనగా చూసేవారిపై శని ఆగ్రహం ఉంటుంది.

Also Read:  Aadhaar Update: ఆధార్ అప్డేట్ ఇంకా చేయలేదా.. దానికి మరో ఐదు రోజులు మాత్రమే?