Akshaya Tritiya 2023:పెళ్లికి ఆటంకాలు ఎదురవుతున్నాయా ? “అక్షయ తృతీయ” నుంచి ఈ పరిహారాలు చేయండి..

ఏప్రిల్ 22న(శనివారం) అక్షయ తృతీయ పర్వదినం జరుపుకోవడానికి పసిడిప్రేమికులు సిద్ధమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - April 22, 2023 / 05:00 AM IST

Akshaya Tritiya 2023: ఏప్రిల్ 22న(శనివారం) అక్షయ తృతీయ పర్వదినం జరుపుకోవడానికి పసిడిప్రేమికులు సిద్ధమవుతున్నారు. “అక్షయ తృతీయ” పేరు చెబితే బంగారం కొనుగోళ్లు గుర్తుకొస్తాయి. పసిడి విక్రయాలు ఊపందు కోవడంతో బులియన్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. ఎంతకూ పెళ్లి సంబంధాలు కుదరనివారు..
అక్షయ తృతీయ రోజు నుంచి ప్రత్యేక పూజలను ప్రారంభిస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ప్రత్యేక పూజల వల్ల వివాహంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయని చెబుతున్నారు. వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్న అబ్బాయిలు అక్షయ తృతీయ నుంచి ప్రతిరోజు 108 సార్లు ‘పత్నీం మనోరమ దేహి మనోవృత్తాను సారిణీం. తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవం’ అనే మంత్రం జపించాలి. ఇదే నియమాన్ని అబ్బాయిలు వారంపాటు పాటించాలి.

■పెళ్లికి ఆటంకాలు ఎదురవుతున్న అమ్మాయిలకు పరిహారం..

ఇక పెళ్లికి ఆటంకాలు ఎదుర వుతున్న అమ్మాయిలకు పరిహారం విషయానికి వస్తే.. వాళ్ళు మా కాత్యాయినికి పూజ, అర్చన చేయాలి.  పసుపు బట్టలు ధరించి, నోటిలో పాన్ తీసుకొని, ఏకాంతంలో ఆవనూనె దీపం వెలిగించి, తామర విత్తనాల మాల ధరించి ‘కాత్యాయనీ మహా మాయే, మహా యోగి న్యాధీశ్వరీ’ అని ప్రతిరోజూ 108 సార్లు జపించాలి. ఈ నియమం 21 రోజులు పాటించాలి. ఇది ఖచ్చితంగా మీ పెళ్లికి ఉన్న ఆటంకాన్ని తొలగిస్తుంది.

■బంగారాన్ని కొనేందుకు ప్రాధాన్యత ఎందుకు?

అక్షయ తృతీయ రోజున తల్లి లక్ష్మి మరియు విష్ణువును పూజిస్తారు.  బంగారం కొనే సంప్రదాయం కూడా ఉంది.  అక్షయ తృతీయకు, పసిడికి అసలు సంబంధం ఏమిటి? ఆ రోజున బంగారాన్ని కొనేందుకు ప్రాధాన్యత ఎందుకు? ఇందుకు కారణాలు ఏమిటి? అంటే.. ఈ రోజున పొందే డబ్బు లేదా బంగారం శాశ్వతమని భావిస్తారు. కొత్త ప్రయత్నాలు విజయాలను చేకూర్చుతాయని, నూతన పెట్టుబడులు చక్కటి ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తారు. సిరిసంపదల పెరుగుదల, అదృష్టానికి ప్రతీకగా అక్షయ తృతీయను నమ్ముతారు. అందుకే శుభప్రదమైన ఈ రోజున బంగారం లేదా ఇతర విలువైన వస్తువుల కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ఈరోజున అవసరంలో ఉన్నవారికి ఆహారం, దుస్తులు, డబ్బు దానం చేస్తారు.

■బంగారమే కొనాలా?

అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 22న శనివారం ఉదయం 07:49 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 23 ఉదయం 07:47 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం.. ఏప్రిల్ 22నే అక్షయ తృతీయను జరుపు కుంటారు. బంగారం కొనుగోలుకు సరైన సమయం ఉదయం 07:49కు ప్రారంభమై ఏప్రిల్ 23న ఉదయం 05:48 వరకు ఉంది. అయితే ఈ సమయంలో పసిడి మాత్రమే కాదు. ఇతర విలువైన వస్తువులు ఏవైనా కొనుగోలు చేయవచ్చు. వాహనాలు లేదా ఇల్లు వంటికి కొనుగోలు చేయవచ్చు.

■బంగారం కొనే స్థోమత లేకుంటే..

బంగారం కొనే స్థోమతలేని వాళ్ల సంగతేంటి?.. అంటే చింతించాల్సిన అవసరమేమీ లేదు. పసిడి కొనుగోలుతో సమానమైన పనులున్నాయి. వాటిని ఆచరిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.. భూమి బంగారం అంత విలువైనది. కాబట్టి అక్షయ తృతీయ నాడు ఇంట్లో ఏదైనా మట్టి కుండ లేదా మట్టి పాత్రను ఉంచాలి. అక్షయ తృతీయ నాడు పూజ గదిలో కొన్ని దూది బంతులను ఉంచితే ఇది కూడా బంగారాన్ని ఉంచు కోవడంతో సమానమనే నమ్మకం ఉంది. ఇక ఒక పిడికెడు పసుపు ఆవాలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం ఉంది.