Site icon HashtagU Telugu

Break Glass: ఇంట్లో అద్దం పగిలితే దేనికి సంకేతమో తెలుసా?

Break Glass

Break Glass

టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా ఇప్పటికీ భారతదేశంలో ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలను మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు. చాలామంది ఆచారాలు సంప్రదాయాలను మూఢనమ్మకాలు అంటూ కొట్టి పారేస్తూ ఉంటారు. కొందరు మాత్రం వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలాగే వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఆచార సంప్రదాయాలను పాటించని చాలామంది వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో జరిగే మంచి చెడులను నిర్ణయిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పాలు నేలపై పడకుండా చూసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు పాలు ఇలా కింద పడితే కొద్దిసేపు ఆగి పార్వతి దేవిని పూజించి అనంతరం బయటకు వెళ్లడం వల్ల మంచిది. అలాగే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కత్తి ఇనుము లాంటివి కింద పడితే వెంటనే హనుమంతుని పూజించి అనంతరం బయటకు వెళ్లడం మంచిది. పెళ్లి విషయం గురించి, అలాగే పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు అద్దం పగిలిపోతే కాసేపు ఆగి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచిది. అలాగే ఎప్పుడు బయటకు వెళ్లినా కూడా అంతే మంచే జరగాలి అని హనుమంతుడిని పూజించి ప్రార్థించి వెళ్లడం వల్ల మంచి జరుగుతుంది.

చాలామంది శుభమా అని బయటకు బయలుదేరినప్పుడు తుమ్ముతూ ఉంటారు. కానీ అలా తుమ్మడం మంచిది కాదు. కావాలనే తుమ్మినప్పుడు పట్టించుకోకుండా వెళ్లిపోవడం మంచిది. కానీ అనుకోకుండా వచ్చిన తుమ్ముల వల్ల ఎటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తుమ్ములు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం పట్టించుకోకుండా ఉండటం మంచిది. అలాగే ఇంట్లో నుంచి పని మీద బయటకు బయలుదేరినప్పుడు కాళీ బకెట్ ను చూడకపోవడమే మంచిది. అలా చూసిన తర్వాత కాసేపు ఆగి విఘ్నేశ్వరుని పూజించి ప్రార్థించి బయటికి వెళ్లడం మంచిది.

Exit mobile version