Site icon HashtagU Telugu

Aparajita Flowers: డబ్బు కొరత ఉండకూడదంటే ఈ పూల మొక్క మీ ఇంట్లో ఉండాల్సిందే?

Mixcollage 14 Jun 2024 04 03 Pm 8458

Mixcollage 14 Jun 2024 04 03 Pm 8458

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు తీరిక లేకుండా కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ కష్టమంతా కూడా డబ్బు కోసమే. డబ్బు సంపాదించి బాగా ఉన్నతంగా బతకాలని, ఆర్థిక సమస్యలు ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఎంత కష్టపడి పని చేసినా కూడా చేతిలో డబ్బులు నిలవవు. సంపాదించిన డబ్బు మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటారు.

ఎంత పొదుపు చేసినప్పటికీ ఎంత ఖర్చు చేయకూడదు అనుకున్నప్పటికీ సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంటే అందుకు వాస్తు పరంగా కూడా కారణం కావచ్చు. డబ్బుకు సంబంధించి సమస్యలను అధిగమించేందుకు వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ పువ్వు మొక్క ఇంట్లో నాటడం. అదే అపరాజిత పుష్పం. దీన్నే శంఖు పువ్వు, విష్ణుకాంత పువ్వు అని కూడా పిలుస్తారు. ఈ అపరాజిత మొక్క కనుక మీ ఇంట్లో ఉంటే డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు దరి చేరవు.

అయితే లక్ష్మీదేవి ఆరాధన ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో సంపదతో నిండిపోతుంది. పూజలో అపరాజిత పువ్వులు పెట్టడం శ్రేయస్కరం. అలాగే ఇంట్లో ఈ మొక్క పెట్టుకునా పురోగతి సాధిస్తారు. ఈ పువ్వును జ్యోతిష్య పరిహారాలలో కూడా ఉపయోగిస్తారు. విష్ణుమూర్తి, శనీశ్వరుడికి శంఖు పూలంటే మహా ప్రీతి. ఈ పువ్వుకు సంబంధించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం, శ్రేయస్సు నిలుస్తాయి. డబ్బు ఇంట్లో నిలుస్తుంది.శని దేవుడికి నీలం రంగు కలిగిన అపరాజిత పూలను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. శనివారం శనీశ్వరుడికి అపరాజిత పూలతో చేసిన పూల దండ సమర్పించాలి. ఇలా చేస్తే శని దేవుడి సంతోషించి మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాడు. అదేవిధంగా డబ్బులు నిల్వ చేసే ప్రదేశంలో ఈ శంఖు పూలను పెట్టడం వల్ల డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పూలు నీలం, తెలుపు రంగుల్లో లభిస్తాయి.

నీలం రంగు పుష్పాలు ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం హనుమంతుడి ఆరాధనలో అపరాజిత పూలు పెట్టాలి. ఆ తర్వాత వాటిని మీ పర్స్ లేదా డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు కొరత తీరుతుంది. అదేవిధంగా వ్యాపారంలో నష్టం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంటే ఏడు శంఖు పూలను తీసుకుని గంగా జలంతో కడిగి పసుపు వస్త్రంలో పెట్టాలి. వాటిని మీరు వ్యాపారం చేస్తే షాపు లేదా డబ్బు పెట్టెలో ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే వ్యాపార నష్టాల నుంచి బయటపడచ్చు. అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే అపరాజిత పూలను హనుమంతుడి పాదాల వద్ద సమర్పించి పూజ చేయాలి. ఇలా చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. మీ కోరిక కూడా నెరవేరుతుంది.