Site icon HashtagU Telugu

Aparajita: ఇంట్లో అపరాజిత మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Aparajita

Aparajita

అపరాజిత పుష్పాల గురించి మనందరికీ తెలిసిందే. ఈ పువ్వులు మనకు తెలుపు, నీలం రెండు రంగులలో కనిపిస్తూ ఉంటాయి. అపరాజిత తెలుపు, నీలం రెండూ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చాలామంది ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. వీటిలో తెల్ల అపరాజిత మొక్క ధనలక్ష్మి ఆకర్షిస్తుంది. తెల్లటి అపరాజిత మొక్క ఇంట్లో వుంటే ఎలాంటి ఇబ్బందులు రానివ్వదు. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతితో పాటు సంపద, ఐశ్వర్యం ఉంటాయి.

తెల్ల అపరాజిత మొక్క గొంతును శుద్ధి చేయడానికి, కళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే మేధస్సు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అదేవిధంగా తెల్ల మచ్చలు, మూత్ర సమస్యలు, ఉబ్బరం, విషాన్ని తొలగించడంలో మేలు చేస్తుంది. అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఉత్తర దిశలో నాటాలి. మన ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల మనం ఎదుర్కొన్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని తెలుపు రంగు మొక్క ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. ఇది మన ఇంట్లో ఉన్నంత సేపు సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. ఆహార ధాన్యాల వంటి వాటికి లోటు ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా తోట ఉంటే అందులో నీలి రంగులోని అపరాజితను నాటడం మంచిది.

ఈ మొక్క సంపద లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా నీలి రంగులోని అపరాజిత మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల మేధస్సు, తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఈ పువ్వులను విష్ణుమూర్తికి సమర్పిస్తే మీకు ఓటమి అనేదే ఉండదు. అలాగే శని భగవానుడికి కూడా నీలి రంగులోని అపరాజిత పువ్వులను సమర్పించడం వల్ల మీకు శని మహాదశ బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ తీగను మీ ఇంటికి ఉత్తర దిశలో నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కచ్చితంగా వస్తాయి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి అనేది ఉంటుంది. అయితే ఈ తీగను ఎప్పటికీ పశ్చిమ దిశలో, దక్షిణ దిశలో నాటకూడదు.