Site icon HashtagU Telugu

AP Temples: ఆలయ అర్చకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

AP Temples

Temples

AP Temples: దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో అర్చకులకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ, ఇతరుల జోక్యం లేకుండా ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారులైన వారికి వైదిక విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, అర్చకులకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది.

పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాలు వంటి విషయాల్లో అధికారుల పాత్రను పరిమితం చేస్తూ చంద్రబాబు సర్కార్ కొత్త జీవో విడుదల చేసింది. దేవాలయాల ఆగమానికి అనుగుణంగా వైదిక విధులను నిర్వహించేందుకు అర్చకులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులది తుది నిర్ణయం అని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని జీవోలో సూచించబడింది.

దేవదాయ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే, ఈవోలు వైదిక కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చని జీవోలో వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుంభాభిషేకాలు, పూజలు, ఇతర సేవలలో అధికారుల పాత్ర పరిమితంగానే ఉండనుంది. పండుగలు, యాగాలు వంటి ముఖ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రభుత్వ జోక్యం కూడా తగ్గనుంది.

 

Exit mobile version