Site icon HashtagU Telugu

Rice: స్త్రీలు బియ్యం కడిగేటప్పుడు ఇలా చేస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వాల్సిందే?

Mixcollage 23 Feb 2024 09 03 Pm 5501

Mixcollage 23 Feb 2024 09 03 Pm 5501

మామూలుగా ఇంట్లో స్త్రీలు నిత్యం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. వాటిలో బియ్యం కడగడం కూడా ఒకటి. అయితే చాలమందికి తెలియని విషయం ఏమిటంటే బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంటుంది. ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు. అలాగే ఇంట్లో చీటికిమాటికి గొడవలు పడడం పెద్దవారితో సమస్యలు, ఒక్కొక్కసారి ఇంట్లో చిన్నపిల్లలకు సమస్యలు ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటుంటాం.. ర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా తొలిగిపోతాయి. మరి అందుకోసం ఎలాంటి నియమం పాటించాలి ఈ స్త్రీలు బీర్యం కడుగుతున్నప్పుడు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

కాగా ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే చాలు. ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారు. అన్నం వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోవాలి. భగవంతుడికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోవాలి. బియ్యాన్ని ఒక గుప్పెడు ఒక సంచిలో వేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల రోజు చేసిన తర్వాత 15 రోజులకు నెల రోజులకు ఒక మూటలా తయారవుతుంది. ఆ మూటను పేదవారికి గాని కాళ్లు లేని వారికి గాని అనాధలకు గాని ఇచ్చి మీ జీవితంలో ఏ లోటు ఉండకుండా చూడమని మనసులో గట్టిగా అనుకోండి.

ఇలా చేయటం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు. పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం, దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటి వారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు. అలాంటి వారిని గ్రహించుకొని మనకి ఉన్న దాంట్లో ఉన్నంత ఎంతోకొంత దానం చేయాలి. దానం చేసే మనకి వచ్చేటువంటి పుణ్యఫలం అంత ఇంతా కాదు. ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు ఆనందాలు కలుగుతాయి.