Vastu Tips: ఇంట్లో చీమలు కనిపించడం అశుభమా.. ఏ దిశలో కనిపిస్తే అదృష్టమో తెలుసా?

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 02:17 PM IST

మామూలుగా ఇంట్లో బయట ఎక్కడ చూసినా కూడా మనకు నల్ల చీమలు ఎర్ర చీమలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది నల్ల చీమలకు ఎటువంటి హాని తలపెట్టరు. మరి కొందరు ఎర్ర చీమలను చంపేస్తూ ఉంటారు. శకున సాముద్రిక శాస్త్రాలు ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా? ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి? ఎటువంటి చీమలు కార్యాలయాలలోనూ వ్యాపార స్థలాలలోనూ కనిపించాలి? ఏవి కనిపిస్తే మనకు దురదృష్టం వస్తుంది? ఏ దిక్కున కనిపిస్తే అదృష్టం వస్తుంది? వంటి అనేక విషయాలను వెల్లడించాయి. ఇంట్లో చీమలు కనిపిస్తే భవిష్యత్ సంకేతాలు ఇక ఆ వివరాల్లోకి వెళితే శకున జ్యోతిష్య శాస్త్రంలో చీమలు మంచి, చెడులను సూచిస్తాయని పేర్కొనబడింది. చీమలు ఇచ్చే కొన్ని సంకేతాల వల్ల మన ఇంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది? భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చని చెబుతున్నాయి.

ముఖ్యంగా చీమల గురించి తెలుసుకోవాలంటే చీమలు రెండు రకాలుగా ఉంటాయని అవి ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మంచిదని, ఎర్ర చీమలు కనిపిస్తే శుభం కాదని శకున శాస్త్రం చెబుతుంది. నల్ల చీమలు.. ఎర్ర చీమలు కనిపిస్తే ఏం జరుగుతుంది? ఆఫీసులో కానీ ఇంట్లో కానీ నల్ల చీమలు బయటకు వస్తున్నాయంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న సంకేతాన్ని ఇస్తుందని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని, కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుందని సంకేతం అని చెబుతున్నారు. ఇక నల్ల చీమలు కూడా విపరీతంగా వస్తూ ఉంటే అది కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. నల్ల చీమలు కనిపించడం మంచిదే అయినప్పటికీ కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఉండడం మంచిది కాదు అంటున్నారు. అదే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

కొన్ని పెద్ద ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.చీమలు ఏ దిశలో వస్తే అదృష్టం అందుకే ఇంట్లో ఎర్ర చీమలు కనిపించకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇక ఇంట్లో నల్ల చీమలు ఏ దిశలో వస్తే అదృష్టం ఏ దిశలో వస్తే దురదృష్టం అన్న విషయాలను చూస్తే పడకగదిలో నల్ల చీమలు కనిపిస్తే కొన్ని బంగారు వస్తువులను కొనుగోలు చేయవచ్చునని, ఇంటి టెర్రస్ పైన నల్ల చీమలు కనిపిస్తే త్వరలో మరో ఆస్తిని కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. చీమలు ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, పడమర వైపు నుంచి చీమలు బయటకు వస్తే ప్రయాణాలు చేయవలసి ఉంటుందని దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయని, తూర్పు దిశ నుండి చీమలు బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.