Site icon HashtagU Telugu

Anantha Padmanabha Temple : అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో ముసలి.. ఇది దేవుడి మాయే..!

another crocodile

another crocodile in Anantha Padmanabha Temple

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు వేలాదిమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ఈ ఆలయంలో అత్యంత ఫేమస్..సరస్సు లో ఉండే ముసలి. సరస్సులో బబియా(Babiya) అనే శాకాహార(Vegetarian) మొసలి(Crocodile) ఉండేది. అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలహారాలు తప్ప మరోటి ముట్టుకునేది కాదు. ఆలయంలోకి వచ్చి తిరుగుతూ ..భక్తులకు దర్శనం ఇస్తూ ఉండేది. గత కొద్దీ దశాబ్దాలుగా ఆ సరస్సులో ఉన్న బబియా గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన చనిపోయింది. బబియా మరణ వార్త యావత్ భక్తులను కలిచివేసింది. బబియా అంత్యక్రియలు సైతం శాస్త్ర పద్దతిలో జరిపారు. అయితే ఇప్పుడు చిత్రమేమిటంటే చనిపోయిన బబియా స్థానంలో మరో కొత్త మొసలి అక్కడ కనిపించడం .. ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

నవంబర్‌ 8వ తేదీన సరస్సు వెంబడి ఉన్న ఓ గుహలో ఈ కొత్త మొసలిని గుర్తించారు భక్తులు. విషయాన్ని అధికారుల చెవిన వేశారు. వారు కూడా శనివారం మొసలిని గుర్తించారు. ఆలయ పూజారికి మొసలి గురించి చెప్పారు. ఆలయ పూజారి(Priest) ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనిపించడమన్నది అక్కడ అనివార్యంగా జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆ సరస్సులో ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోదని అంటున్నారు. చనిపోయినప్పుడు దాని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఆలయంలో మరో ముసలి కనిపిస్తుందనే వార్త వైరల్ కావడం తో చుట్టూ పక్కల ప్రజలే కాక భక్తులు కూడా ఆలయం కు వస్తున్నారు. ఇదంతా ఆ మహా విష్ణువు మాయే అని భక్తులు చెపుతున్నారు.

Read Also : Ajay Bhupathi: మంగళవారం’లో జీరో ఎక్స్‌పోజింగ్, చివరి 45 నిమిషాల్లో ట్విస్టులు నెట్స్ట్ లెవల్‌