TTD: అన్నమయ్య  వర్ధంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి షురూ

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 11:44 PM IST

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతినిత్యం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇటీవల తెప్పోత్సవం వేడుకలు ఘనంగా జరగగా, తాజాగా అన్నమయ్య వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగనున్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులవారి 521వ వ‌ర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 5న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో స‌ప్త‌గిరి సంకీర్త‌నా గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.