Site icon HashtagU Telugu

Anjaneya Swamy: ఆంజనేయ స్వామికీ ఇలాంటీ పూజలు చేస్తే చాలు.. ఆ దోషాలు మాయమైనట్టే?

Anjaneya Swamy

Anjaneya Swamy

హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో ఆంజనేయస్వామి కూడా ఒకరు.. ఆంజనేయ స్వామిని కొందరు మంగళవారం పూజిస్తే మరి కొందరు శనివారం పూజిస్తూ ఉంటారు. కాగా హనుమాన్ రామ భక్తుడు అన్న విషయం తెలిసిందే. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఎక్కువ శాతం మంది భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కొందరు తమలపాకులతో పూజిస్తే మరి కొందరు సింధూరంతో పూజిస్తూ ఉంటారు. హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం.

అందుకే ఈయనకు తమలపాకులు లేకుండా పూజలు చేయరు. అయితే హనుమంతుడిని అందరి దేవుళ్ళలాగా ఎలాగా పడితే అలా పూజించరు. ఎందుకంటే దీనికి కూడా కొన్ని ఆచారాలు, నియమాలు ఉన్నాయి. హనుమంతుడు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. సకల కార్యజయం కావాలంటే హనుమాన్ ను అర్చించాలి. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ దోషాలు పోవడానికి ఆంజనేయుడిని ఆరాధిస్తే చాలు. ఈయన సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణా, అర్చన ద్వారా పోతాయి. చిన్నపిల్లకు ఆంజనేయుడు బిళ్ళ మెడలో కడితే సకల దోషాల నుండి వారు విముక్తి పొందుతారు.

మీరు ఆంజనేయ స్వామిని కొలిస్తే గ్రహ పీడ నుండి విముక్తి పొందుతారట.. అలాగే పిల్లలు లేని దంపతులు పిల్లలు పుట్టడానికి ఉన్న నవగ్రహ దోషాలు, కార్యాల్లో ఆటంకం రాకుండా సుందరకాండ పారాయణం చేస్తే సకల దోషాలు తొలగిపోయి సర్వకార్య జయం కలుగుతుంది. హనుమంతునికి ఎంతో ఇష్టమైన సింధూరాన్ని సమర్పించడం వల్ల ఆయన కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అలాగే హనుమంతుని పూజించడం వల్ల శనికి సంబంధించిన ధోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి