Site icon HashtagU Telugu

Sesame Oil: దీపారాధనలో నువ్వుల నూనెను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

Sesame Oil

Sesame Oil

నువ్వుల నూనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నువ్వుల నూనె కేవలం పూజలో ఉపయోగించడం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అలాగే అందానికి ఎన్నో మంచి మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. నువ్వుల నూనెలో ఉండే భాస్వరం ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అంతే కాకుండా ఆయుర్వేద చికిత్సలో ఎన్నో రకాల జబ్బులకు ఉపయోగిస్తారు. అలాగే నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు. ఆయుర్వేదలో వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనెగా పరిగణించబడనది.

నువ్వుల నూనెలో, విటమిన్ సి మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, నువ్వులు విటమిన్ – బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది, ఇవి పప్పు దినుసులు, వేరుశెనగ, బీన్స్, చోలాస్ మరియు సోయాబీన్స్ వంటి చాలా శాఖాహార ఆహారాలలో కనిపించవు. నువ్వుల నూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇది గుండె కండరాలు సజావుగా పనిచేయడానికి సహాయ పడుతుంది.

ఇకపోతే అసలు విషయంలోకి వెళితే చాలామంది పూజలో ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. వివిధ రకాల నూనెతోపాటు ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. మనుధర్మం ప్రకారం నువ్వుల నూనె లేకుండా ఈ కార్యము సిద్ధించదు. అనగా పుట్టుక,మరణం,యజ్ఞం శ్లోకం,తప పిత్ర పూజ మొదలైనవి అన్ని కూడా నువ్వులు లేకుండా నువ్వుల నూనె లేకుండా మొదలవ్వవు. కాబట్టి పూజకు ఉపయోగించే నూనెలలో మొదటగా నువ్వుల నూనెకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. నువ్వుల నూనెతో చేసే దీపారాధన వల్ల మనల్ని వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. అందువల్ల శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే వాళ్లు నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారు.