Dussehra 2024 : 18 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ? వాటి ప్రాశస్త్యం ఏమిటి ?

మరికొందరు 108 శక్తి పీఠాలు(Dussehra 2024) ఉన్నాయని అంటుంటారు. దసరా పండుగ, దుర్గా ఉత్సవాల వేళ ఈ శక్తిపీఠాలను సందర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు.  

Published By: HashtagU Telugu Desk
Ashtadasha Shakti Peethas Dussehra 2024

Dussehra 2024 : హిందువులకు అష్టాదశ శక్తిపీఠాలు ఎంతో పవిత్రమైనవి. అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 శక్తి పీఠాలు. కానీ కొందరు 51 శక్తి పీఠాలు ఉన్నాయని చెబుతుంటారు. మరికొందరు 108 శక్తి పీఠాలు(Dussehra 2024) ఉన్నాయని అంటుంటారు. దసరా పండుగ, దుర్గా ఉత్సవాల వేళ ఈ శక్తిపీఠాలను సందర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు.

శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ?

  • బృహస్పతి యాగం చేసేందుకు దక్షుడు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ అల్లుడు శివుడు, కుమార్తె సతీదేవిని పిలవడు. తనను ధిక్కరించి శివుడిని పెళ్లి చేసుకోవడంతో కూతురు సతీదేవిపై దక్షుడికి కోపం ఉండేది. అందుకే వారిని యాగానికి పిలవలేదు.
  • తనను పిలవకున్నా ఆ యాగానికి సతీదేవి వెళ్తుంది. అయితే అక్కడ ఆమె అవమానానికి గురవుతుంది.  తన  తండ్రి చేస్తున్న శివనిందను సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి ప్రాణం తీసుకుంటుంది.
  • దీంతో కోపించిన శివుడు యాగశాలను ధ్వంసం చేస్తాడు.
  • సతీదేవి వియోగంతో ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్షణ కార్యాన్ని శివుడు పక్కనపెట్టాడు.
  • చివరకు దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడికి ఆయన విధిని గుర్తుచేస్తాడు.
  • శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి.
  • ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా భైరవుడు(శివుడు) దర్శనమిస్తాడు.
  Last Updated: 10 Sep 2024, 10:11 AM IST