Site icon HashtagU Telugu

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున ఏ రాశుల వారు ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయాలో మీకు తెలుసా?

Akshaya Tritiya

Akshaya Tritiya

ఈ ఏడాది అనగా 2025లో ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం, అక్షయ తృతీయను 2025 ఏప్రిల్ 30న జరుపుకుంటారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తాయని నమ్మకం. అయితే మరి రాశి ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనడం శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇకపోతే అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను కొనుగోలు చేయాలి అన్న విషయానికి వస్తే..

మేష రాశి.. ఈ రాశి వారు బంగారం కొనడం శుభప్రదం అని చెబుతున్నారు. వీరు బంగారు ఉంగరం లేదా ఏదైనా చిన్న ఆభరణాలను కొనుగోలు చేయవచ్చట

ఇకపోతే వృషభ రాశి అధిపతి శుక్రుడు. వెండి శుక్రుడికి సంబంధించినది. అందువల్ల ఈ రాశి వారు వెండి ఆభరణాలు, నాణేలు కొనడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు.

మిథున రాశి వారు బంగారు గొలుసు లేదా చెవిపోగులు కొనడం ప్రయోజనకరంగా ఉంటుందట.

కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు వెండికి సంబంధించినవాడు. కాబట్టి ఈ రాశి వారు ఏదైనా వెండి వస్తువులను కొనుగోలు చేయడం మంచిది.

అదేవిధంగా సింహ రాశి వారు బంగారం కొనడం చాలా శుభప్రదం. ఈ రాశి వారు బంగారు లాకెట్ లేదా గొలుసు కొనవచ్చట.

కన్య రాశి వారికి, బంగారు గాజులు, ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం వల్ల కెరీర్‌ లో విజయం సాధించవచ్చట. కాబట్టి ఈ రాశి వారు బంగారు కొనుగోలు చేయడం మంచిది.

తుల రాశి వారు వెండి పట్టీలు కొని లక్ష్మీ దేవికి సమర్పించి ధరించాలట. ఇది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని, మానసిక శాంతిని కాపాడుతుందనీ పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి రాశి వారు బంగారు ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం శుభప్రదం అని చెప్తున్నారు. అయితే ఈ రాశి అధిపతి కుజుడు కనుక పరిమిత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగించడం మంచిదట.

ఇక ధనుస్సు రాశి వారికి బంగారం ధరించడం చాలా ప్రయోజనకరం అని చెబుతున్నారు. మీరు బంగారు గొలుసు, పాపిడి బొట్టు లేదా ఏదైనా ఇతర ఆభరణాలను కొనుగోలు చేయవచ్చట.

మకర రాశి, కుంభ రాశి.. ఈ రెండు రాశుల అధిపతి శనిశ్వరుడు. కాబట్టి వెండికి సంబంధించినది. కనుక ఈ రాశుకి సంబంధించిన వ్యక్తులు వెండి ఆభరణాలు లేదా కాళ్ళ పట్టీలు కొనడం శుభప్రదం అని చెబుతున్నారు.

మీన రాశి అధిపతి బృహస్పతి. బంగారం బృహస్పతికి సంబంధించినది. కనుక ఈ రాశి వ్యక్తులు గాజులు, నెక్లెస్ లేదా చెవిపోగులు వంటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం శుభప్రదం…