ఈ ఏడాది అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30, బుధవారం నాడు వచ్చింది. అక్షయ తృతీయను హిందూ ధర్మంలో చాలా శుభ దినంగా భావిస్తారు. అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించడం, బంగారం, వెండి కొనుగోలు చేయడం వంటివి పాటించడం వలన ఇంటికి శుభాన్ని తెస్తుందని నమ్ముతారు. తృతీయ తిథి 2025 ఏప్రిల్ 29 సాయంత్రం 05:31 గంటలకు ప్రారంభమై 2025 ఏప్రిల్ 30 మధ్యాహ్నం 02:12 గంటలకు ముగుస్తుంది.
కాగా అక్షయ తృతీయ పూజా ముహూర్తం 2025 విషయానికి వస్తే.. అక్షయ తృతీయ పూజా ముహూర్తం 2025 ఏప్రిల్ 30 ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుందట. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు శుభ సమయం ఉదయం 05.41 నుండి మధ్యాహ్నం 02.12 వరకు ఉంటుంది. మొత్తం సమయం 08 గంటలు 30 నిమిషాలు ఉన్నాయి. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నారు.. ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:18 లోపు కొనుగోలు చేయడం మంచిది.
కాగా అక్షయ తృతీయ సంతోషం, అదృష్టం, విజయాన్ని తెస్తుంది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం భవిష్యత్తులో ఎక్కువ సంపద మరియు సమృద్ధిని తెస్తుంది. ఈ రోజున కొనుగోలు చేసిన బంగారం ఎప్పటికీ తగ్గదు. ఎల్లప్పుడూ పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఈ రోజున బంగారు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారు షాపులు మొత్తం అన్ని కిటకిటలాడుతూ ఉంటాయి.