Site icon HashtagU Telugu

Aishwarya Deepam: ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాల్సిందే?

Mixcollage 29 Jan 2024 10 32 Am 8459

Mixcollage 29 Jan 2024 10 32 Am 8459

చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల పూజలు పరిహారాలు దానధర్మాలు చేస్తూ ఉంటారు. కొందరికి అమ్మవారి అనుగ్రహం తొందరగా గలిగే మరికొందరికి ఎన్ని పూజలు చేసినా కూడా లక్ష్మి అనుగ్రహం అసలు కలగదు. అలాంటప్పుడు ఐశ్వర్య దీపం వెలిగించాల్సిందే అంటున్నారు పండితులు. ఇంతకీ ఐశ్వర్య దీపం అంటే ఏమిటి? ఈ దీపాన్ని ఏ సమయంలో ఎలా వెలిగించాలి? ఏ రోజు వెలిగించాలి అన్న వివరాల్లోకి వెళితే.. ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు అలాగే సూర్యాస్తమయానికి తర్వాత వెలిగించాలి. ఇలా చేసిన వారికి తప్పకుండా ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. సంపద పెరుగుతుంది.

వ్యాపారాలు గణనీయంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నవారు, అప్పులపాలై బాధలు పడుతున్న వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే వారికి ఆర్థిక ప్రగతి కలుగుతుంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక ఐశ్వర్యాన్ని అందించే ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి? అన్న విషయానికొస్తే.. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పెద్ద ప్రమిదలను తీసుకుని వాటికి పసుపు, కుంకుమ రాయాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి, ఆ ముగ్గులో ఒకదానిపై ఒకటిగా పెట్టి, ఒక పావు కిలో రాళ్ల ఉప్పు వేసి, ఆ రాళ్ళ ఉప్పుపైన పసుపు, కుంకుమ చల్లాలి. దానిపై ఒక చిన్న ప్రమిదను పెట్టి రెండు వత్తులు ఒకటిగా వేసి దీపం వెలిగించాలి. దీనినే ఐశ్వర్య దీపం అంటారు.

ఇక ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు, పళ్ళు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా పెట్టి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకోవాలి. కనకధార స్తోత్రాన్ని కూడా చదివితే మంచిది. శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి, ఆ ఉప్పును నీటిలో కలిపి ఎవరూ తొక్కని ప్రదేశంలో పారబోయాలి. పారే నీటిలో పోయడం ఇంకా చాలా మంచిది. ఈ విధంగా 11, 16, 21, 41 శుక్రవారాలు చేస్తే ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు. ఐశ్వర్య దీపంతో ఆర్ధిక సమస్యల నుండి కొంతమేర ఉపశమనం తప్పక లభిస్తుంది. కనుక ఊహించని ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్న వారు ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది.