Site icon HashtagU Telugu

Ahobilam: అహోబిలం నరసింహస్వామి ప్రసాదంతో ఆరోగ్యమస్తు!

Prasadam Imresizer

Prasadam Imresizer

Ahobilam: ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టుగా.. ఒక్కో ప్రసాదానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. తిరుపతి వేంకటేశ్వర స్వామి ప్రసాదం ఎంత ఫేమస్సో, అహోబిల నరసింహస్వామి పానక నైవేద్యం కూడా అంతే ప్రసిద్ధి. మంగళగిరి నృసింహస్వామి దేవునికి, అహోబిల నరసింహ దేవునికి నైవేద్యంగా పెట్టే పానక తీర్థాన్ని సేవిస్తే… దేహంలో ఉత్సాహం ఎక్కువవుతుంది. పానకాల స్వామి, పానకాల నరసింహ స్వామిగా పేరొందిన మంగళగిరి నరసింహుడు, అహోబిలులకు పెట్టే పానక నైవేద్యాన్ని సేవించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా పానక తీర్థాన్ని సేవిచండం ద్వారా దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వస్తుంది.

మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి. జీవితంలో శత్రువుల బాధ కలుగదు. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. అలాగే ఆలయాల్లో ఇచ్చే పంచామృత అభిషేక తీర్థాన్ని సేవించడం ద్వారా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది.

ఆలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాల్లో నాలుగు రకాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీటిని జలతీర్థం, కషాయతీర్థం, పంచామృత అభిషేక తీర్థం, పానక తీర్థం అంటారు. జలతీర్థం సేవించడం ద్వారా అకాల మృత్యువు సర్వ రోగాలు నివారించబడతాయి. అన్నికష్టాలు, దుఃఖాల నుంచి ఉపశమనం లభిస్తుంది.