2022లో చివరి పంచక తిథి ఈరోజు నుంచే మొదలు.. ఈ తప్పులు చేయకండి!!

పంచక తిథి సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదని నమ్ముతారు. ఎందుకంటే ఇది అత్యంత అశుభకరమైన కాలంగా పరిగణించబడుతుంది.

  • Written By:
  • Publish Date - December 27, 2022 / 10:09 AM IST

పంచక తిథి సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదని నమ్ముతారు. ఎందుకంటే ఇది అత్యంత అశుభకరమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈసారి పంచక్ 2022 డిసెంబర్ 27న నుంచి ప్రారంభమవుతుంది.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు ధనిష్ట నక్షత్రం, శతభిషా నక్షత్రం, రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్రపద , పూర్వాభాద్రపదాలలో మూడో పాదంలో ప్రయాణించినప్పుడు పంచక తిథి ప్రారంభమవుతుంది.
చంద్రుడు కుంభం మరియు మీనంలో సంచరించినప్పుడు పంచక తిథి షురూ అవుతుంది.  మంగళవారం జరిగే పంచకాన్ని అగ్ని పంచకం అంటారు. అగ్ని పంచక్ అశుభమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పంచకంలో ఏ శుభ కార్యమూ జరగదు. ఈ సారి పంచకం నేటి (డిసెంబర్ 27) నుండి ప్రారంభమవుతుంది. పంచక్ 5 రోజులు ఉంటుంది. పంచకం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నెలలో పంచక్ ఎంత కాలం ?

ప్రతి నెలలో పంచకానికి ఐదు రోజులు ఉంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈసారి డిసెంబర్ 27, 2022, మంగళవారం ఉదయం 03:31 గంటలకు పంచక తిథి ప్రారంభమై డిసెంబర్ 31, 2022 శనివారం ఉదయం 11:47 గంటలకు ముగుస్తుంది. ఈసారి అగ్ని పంచక్ జరగబోతోంది. పంచక సమయంలో ఏమి చేయకూడదు.

ఏమేం చేయకూడదు?

* పంచక్ సమయంలో, ఇంట్లో కలపను కొనుగోలు చేయకూడదు లేదా కలపను సేకరించకూడదు.
*  చెక్కతో చేసిన వాటిని కొనకండి లేదా తయారు చేయవద్దు.
* పంచక్ సమయంలో దక్షిణ దిశలో ప్రయాణించడం మానుకోండి. నమ్మకాల ప్రకారం, ఈ దిశను యమరాజ్ దిశగా పరిగణిస్తారు.
* పంచక్ సమయంలో, ఇంటిని నిర్మించకూడదు లేదా ఇంట్లో లాంతరు ఏర్పాటు చేయకూడదు.
* పంచక్ సమయంలో మంచం కూడా వేయకూడదు.
* పంచక్ సమయంలో ఎవరైనా మరణించినట్లయితే, చనిపోయిన వ్యక్తి మృతదేహంతో పాటు పిండి లేదా కుష్‌తో చేసిన ఐదు దిష్టిబొమ్మలను ఉంచాలని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల పంచక దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
* పంచక్ సమయంలో మంచం కొనడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది.

పంచక్ యొక్క నివారణలు

*  మీరు పంచక్ సమయంలో ఏదైనా పని చేస్తుంటే, ఆ పని చేసే ముందు కూలీలకు మిఠాయిలు పంచండి.
* ఏదైనా కారణం చేత మీరు పంచక్ సమయంలో దక్షిణం వైపు ప్రయాణించవలసి వస్తే, హనుమాన్ ఆలయంలో 5 పండ్లు సమర్పించి ప్రయాణం చేయండి.