Hindu Rituals: సూర్యాస్తమయం తర్వాత ఇవి అస్సలు దానం చెయ్యకూడదు.. చేస్తే అలాంటి నష్టం?

సాధారణంగా హిందువులు కొన్ని రకాల వస్తువులను దానం చేయడానికి శుభసూచికంగా భావించడంతో పాటు మంచి జరుగుతుంది అని కూడా భావిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 06:30 AM IST

సాధారణంగా హిందువులు కొన్ని రకాల వస్తువులను దానం చేయడానికి శుభసూచికంగా భావించడంతో పాటు మంచి జరుగుతుంది అని కూడా భావిస్తూ ఉంటారు. అయితే వస్తువులను దానం చేయడం మంచిదే అయినప్పటికీ వాస్తు శాస్త్ర ప్రకారం సూర్యాస్తమయం తరువాత కొన్ని రకాల వస్తువులను దానం చేయడం అసలు మంచిది కాదు. కొన్ని రకాల వస్తువులను సూర్యాస్తమయం తరువాత దానం చేయకూడదు. అదేవిధంగా ఎదుటివారి నుంచి కూడా సాయంత్రం సమయంలో దీనిని కూడా అప్పులాగా తీసుకోకూడదు. మరి ఎటువంటి వస్తువులను సూర్యాస్తమయం తరువాత దానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాస్తు శాస్త్ర ప్రకారం సాయంత్రం సమయంలో పసుపు దానం చేస్తే ఇంట్లో మంచి జరగదు. పసుపు గృహస్పతి కారకంగా పరిగణిస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో పసుపును దానం చేయకూడదు. పాలు విష్ణు లక్ష్మీ దేవత కారకంగా భావిస్తారు కాబట్టి సూర్యాస్తమయం తరువాత పాలు దానం చేయడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. అలాగే పెరుగును కూడా శుక్రుని కారకంగా పరిగణిస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో దానం చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు, పోతుంది అని నమ్ముతారు. అదేవిధంగా మన ఇంట్లో పాడైపోయిన ఆహారాన్ని దానం చేయడం కూడా మంచిది కాదు.

అలా ఎప్పుడు చేయకూడదు. దానం చేయాల్సి వస్తే శుభ్రంగా మనం తినే ఆహారాన్ని మాత్రమే దానం చేయాలి. అలాగే డబ్బులు ఇవ్వడం వ్యాపారం లాంటివి కూడా సాయంత్రం సమయంలో చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని భావిస్తూ ఉంటారు. ఇంట్లో కూడా డబ్బు సమస్యలు మొదలవుతాయి. అందుకే సాయంత్రం సమయంలో రుణాలు ఇవ్వడం రుణాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు.