Bath and Vastu: స్నానం చేసిన తర్వాత స్త్రీలు ఈ పనులు తప్పకుండా చెయ్యాలి.. లేదంటే?

జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలి అని అనుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 07:15 AM IST

జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలి అని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం నిత్యం దేవుళ్ళకు పూజలు చేస్తూ మొక్కులను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే అన్ని సక్రమంగానే జరుగుతున్నప్పటికీ మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల అనుకోకుండా కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటూ ఉంటారు. ఇంట్లో స్త్రీ ఆచరించే విధి విధానాలను బట్టి ఆ ఇంటి యొక్క పరిస్థితులు ఉంటాయి అని అంటూ ఉంటారు. మరి అటువంటి స్త్రీ ప్రతి రోజు స్నానం చేసిన తర్వాత ఎటువంటి పనులు చేయాలి? స్నానం చేయకుండా అటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా మహిళలు స్నానం చేసిన తర్వాతనే కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మహిళలు స్నానం చేయకుండా డబ్బు ముట్టుకోకూడదు. మహిళలు స్నానం చేయకుండా డబ్బులు ముట్టుకుంటే లక్ష్మీదేవి కీ కోపం వస్తుందట. దీంతో తీవ్ర ఆగ్రహం చెంది ఇంటిలో నుంచి వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా మహిళలు స్నానం చేయకుండా తులసి మొక్క మీద చెయ్యి వేయకూడదు. అలాగే తులసి మొక్కకు నీళ్లు కూడా పోయకూడదు. ఒకవేళ మహిళలు స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకున్న నీరు పోసిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.

కాబట్టి మహిళలు స్నానం చేసిన తర్వాతనే తులసి చెట్టుని ముట్టుకోవడం పూజ చేయడం నీళ్లు పోయడం లాంటివి చేయాలి. అలాగే స్నానం చేయడానికి ముందే ఎప్పుడూ కూడా జుట్టును దువ్వుకోకూడదు. ఇలా చేస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా సమయంలో తల స్నానం చేసిన తర్వాతనే తల దువ్వుకోవడం లాంటివి చేయాలని చెబుతున్నారు. అలాగే చాలామంది మహిళలు మొదటగా చేసే పని స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లడం. ఇలా స్నానం చేయకుండా వంట గదిలోకి వెళితే అనారోగ్యం పాడిన పడతారట. చాలామంది అయితే బిజీ బిజీ షెడ్యూల్ వల్ల స్నానం చేయకుండా బ్రేక్ ఫాస్ట్ భోజనం కూడా తింటూ ఉంటారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదట.