హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి. చాలామంది ఉగాది అనగానే కొన్ని రకాల వంటలు చేసుకోవడం లేదంటే ఉగాది పచ్చడి చేసుకొని తినడం అని అనుకుంటూ ఉంటారు. ఉగాది అంటే పచ్చడి మాత్రమే కాదని ఆరోజు చేయాల్సిన పనిలో కొన్ని ఉన్నాయని చెబుతున్నారు. మరి ఇంతకీ ఉగాది పండుగ రోజున ఏం చేయాలి? ఆరోజు పాటించాల్సిన విధివిధానాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. చైత్ర శుద్ధ పాడ్యమి రోజే సృష్టి మొదలైంది. అందుకే ఆరోజు ని యుగాది లేదా ఉగాదిగా పిలుస్తారు.
ఇది ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా ఈ ఉగాది పండుగ రోజు మాత్రం తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె ఒంటికి పట్టించే తల స్నానం చేయాలని చెబుతున్నారు. ఆ తర్వాత గడపకు కుంకుమ పసుపు బొట్లు పెట్టి తోరణాలు కట్టి అలంకరించాలని చెబుతున్నారు. ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి, మనకు ఇష్టమైన దైవాన్ని కాలపురుషునిగా తలుచుకుని పూజించుకోవాలట. ఇష్ట దేవతల స్త్రోతాన్ని పఠించి పూజించిన తర్వాత ఉగాది పచ్చడిని నివేదించాలట. పులుపు, తీపి, చేదు, వగరు, కారం,ఉప్పు వంటి ఆరు రకాల రోజుల కలయికనే ఈ ఉగాది పచ్చడి.
సంవత్సరం మొదటి రోజైనా ఉగాది పండుగ రోజున తప్పకుండా పంచాంగం వినాలని చెబుతున్నారు. సంవత్సరం మొదటి రోజు ఏంటి అనుకుంటున్నారా.. హిందువులకు అసలైన కొత్త సంవత్సరం ఈ పండుగతోనే మొదలవుతుంది. అంటే కొత్త ఏడాదినా వచ్చే మొట్టమొదటి పండుగ అనగానే ఉగాది అని చెప్పాలి.. అలాగే ఉగాది పండుగ రోజు ప్రపాదానం అంటే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. అలాగే ఉగాది నుంచి వేసవికాలం మొదలవుతుంది కాబట్టి ఉగాది పండుగ రోజున చెప్పులు, గొడుగులు వంటివి విధానం చేసినా కూడా మంచి జరుగుతుందట. ఉగాది పండుగ అంటే ఏ దైవానికి సంబంధించినది కాదు కాబట్టి ఇంతకుముందు ఎన్నడూ సందర్శించని దేవాలయాలు ఆ సందర్శించాలని చెబుతున్నారు. ఉగాది పండుగ అంటే నూతన సంవత్సరం కాబట్టి ఏవైనా కొత్తగా పనులు ప్రారంభించాలని చెబుతున్నారు..