Vastu Shastra: వాస్తు ప్రకారం…ఈ ఐదు వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు..అవేంటో తెలుసా..?

సాధారణంగా కొన్ని వస్తువులను స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులతో పంచుకుంటాం. వాళ్లకు కావాల్సింది వారి వద్ద ఉన్నప్పుడు...లేదా మనకు కావాల్సింది వారి దగ్గర ఉన్నప్పుడు షేర్ చేసుకోవడం సర్వసాధారణం.

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 08:15 AM IST

సాధారణంగా కొన్ని వస్తువులను స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులతో పంచుకుంటాం. వాళ్లకు కావాల్సింది వారి వద్ద ఉన్నప్పుడు…లేదా మనకు కావాల్సింది వారి దగ్గర ఉన్నప్పుడు షేర్ చేసుకోవడం సర్వసాధారణం. కానీ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఎంత దగ్గరివారైనా సరే పంచుకోకూడదు. అవి మన జీవితంలో కష్టాలను తెచ్చిపెడతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం.

బట్టలు:
ఎన్నోసార్లు స్నేహితులు, కుటుంబ సభ్యులను మార్చుకుంటాం. కొన్నిసార్లు నచ్చిన దుస్తులను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం, బట్టలు మార్పిడి మానుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఒక వ్యక్తి దురదృష్టం బట్టల రూపంలో బదిలీ అవుతుంది.

ఇతరుల బూట్లు:
ఇతరుల చెప్పులు కానీ బూట్లు కానీ ధరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అంత సులభంగా ఇతరులవి ధరించడానికి ఇష్టపడము. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని వ్యక్తులవి కానీ స్నేహితులవి కానీ ధరిస్తుంటాం. అయితే వాస్తు శాస్త్రంలో అశుభకరంగా పరిగణిస్తారు. ఇతరుల పాదరక్షలను అస్సలు ధరించకూడదు. శని వ్యక్తి పాదాలలో నివసిస్తాడు. కాబట్టి వేరొకరి బూట్లు ధరించడం వల్ల శని ప్రభావం ధరించిన వారిపై వ్యాపిస్తుంది. ఇది ఇంట్లో సామరస్యం, అశాంతికి కారణం అవుతుంది.

అప్పుగా పెన్ను :
మనం పెన్నులు కొనడం మామూలే. కానీ అవసరానికి పెన్ను అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు మనం ఇతరుల పెన్ను అడిగి తీసుకుంటాం.కానీ వాస్తు శాస్త్రంలో ఇది తప్పు. నిజానికి, ఒక వ్యక్తి విధి కలంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి, పెన్ను ఇచ్చే వ్యక్తి దురదృష్ట కాలంతో బాధపడుతూ ఉంటే..మీరు పెన్ను తీసుకుంటే దురదృష్టాన్ని మీరే తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి, మీరు ఎప్పుడైనా పెన్ను తీసుకున్న తర్వాత మీ పని ముగియగానే తిరిగి ఇవ్వాలని గుర్తుంచుకోండి.

గడియారం:
స్నేహితుడు లేదా తోబుట్టువు నుండి ఒక వాచీని తీసుకుంటే అది ధరించకపోవడమే మంచిది, వీలైనంత వరకు మీ స్వంత వాచ్‌ని ధరించండి. ఎందుకంటే గడియారం మీకు సమయాన్ని మాత్రమే చెబుతుందని. కానీ మీ జీవితంలో రాబోయే మంచి, చెడు సమయాలు కూడా దానితో ముడిపడి గడియారంతో ముడిపడి ఉన్నాయి. మీరు అరువుగా తెచ్చుకున్న వారి కష్టాలు వెంటాడుతుంటే…అవి మీపై కూడా ప్రభావం చూపుతాయి.

చేతి ఉంగరాలు:
మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైనా ఉంగరం లేదా రత్నాన్ని ధరించడం మానుకోండి. ప్రతి ఉంగరం లేదా రత్నం ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. దానిని ధరించే ముందు, ఆ రత్నం మీకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. మీకు సరికాని ఉంగరాలు లేదా రత్నాలను ధరించడం వల్ల ప్రాణహాని లేదా ఇతర హాని కలిగించవచ్చు.