Site icon HashtagU Telugu

Cow Idol: మీ అదృష్టం పెరగాలంటే ఆవు విగ్రహం లేదా ఫొటో అక్కడ పెట్టాల్సిందే?

1ccbe5a778a6c3e011bdb9cb7920d28c

1ccbe5a778a6c3e011bdb9cb7920d28c

మామూలుగా మనం ఇంట్లో ఉండే వస్తువులను మొక్కలను వాస్తు ప్రకారం గా అమర్చుకుంటూ ఉంటాం. అయితే మనం వాస్తు ప్రకారంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు వాస్తు దోషాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే వాస్తు నియమాలను తప్పకుండా పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు. అలాగే ఇంట్లోపాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే వాస్తు ప్రాకారం మీ ఇంట్లో ఆవు విగ్రహం లేదా ఫోటోని ఉంచడం మంచిది. శ్రీకృష్ణుడికి ఆవు ఎంతో ఇష్టం.

భూమికి చిహ్నమే ఆవు. అందుకే దేవతలందరూ ఆవులోనే నివసిస్తారని చెబుతుంటారు. సముద్రం నుండి ఉద్భవించిన 14 రత్నాలలో కామధేను ఒకటి. మరి వాస్తు ప్రకారం ఇంట్లో ఆవు విగ్రహం లేదా ఆవు ఫోటో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆవు చిత్ర పటాన్ని ఇంట్లో తూర్పు, ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల గొడవలు, దుఃఖాలు, ఆందోళనలకు కారణమయ్యే శక్తులు తొలగిపోతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. మీ ఇంట్లో దూడకు పాలు ఇస్తున్న ఆవు విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టడం వల్ల మీకు మంచి గుణం ఉండే బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది.

అందుకోసం భార్య భర్తలు తమ పడకగదిలో ఆవు చిత్రపటాన్ని పెట్టాలి. అలాగే ఇల్లును లేదా పెద్ద పెద్ద భవనాలను నిర్మించడానికి ముందు ఆవును పూజించండం మంచిది. అప్పుడే పుట్టిన దూడను ఆవు ఎంతో ప్రేమతో నాకుతుంది. ఇలాంటి చిత్రపటాలను ఇంట్లో పెడితే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఆవులు ఉన్న ఇళ్లలో అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. అదేవిధంగా ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు లేదా ఉన్నతాధికారులను కలిసేటప్పుడు ఆవుకు పచ్చిగడ్డిని పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఇది మీ భయాలను కూడా తొలగిస్తుంది. ఇంట్లోనే కాదు మీ ఆఫీసులో కూడా కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ఆలోచనలలో సానుకూల మార్పులను తెస్తుంది. అలాగే మీ సహనాన్ని పెంచుతుంది. ఇది మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. వ్యాపారంలో మంచి విజయం సాధించడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీ ఇంటి ఉత్తర దిశలో రాధా కృష్ణులు వేణువు వాయించడం, ఆవు వారి వెనుక ఉన్న ప్రతిమను మీ ఇంట్లో పెట్టడం వల్ల ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తులను పోగొడుతుంది. మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు.

Exit mobile version