Site icon HashtagU Telugu

Vastu Tips: మీ ఇంట్లో కూడా అక్వేరియం ఉందా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Vastu Tips

Vastu Tips

చాలామందికి ఇంట్లో అక్వేరియంలో చేపలు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే వీటికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేయించుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అక్వేరియాలను ఇంట్లో పెట్టుకుని చేపలను పెంచుతూ ఉంటారు. ఇటీవల కాలంలో అయితే ఇది బాగా ట్రెండ్ అయిపోయింది. దీంతో ప్రతి ఒక్కరూ ఇళ్లలో చేపలను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే అక్వేరియం పెట్టుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు. మీ ఇంట్లో అక్వేరియం ఉంటే ప్రతికూల శక్తి మీఇంట్లోకి ప్రవేశించదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఫిష్ ట్యాంకులోని నీటి శబ్దం ఇంట్లో సానుకూల శక్తి, ఆనందం పెంచుతుందట. ఈ విషయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

ఇంట్లో ఏ దిశలో అక్వేరియం ఉన్నది అన్న విషయానికి వస్తే.. ఎప్పుడు కూడా అక్వేరియాన్ని ఇంట్లో ఈశాన్యం లేదంటే ఆగ్నేయం దిశల్లో మాత్రమే పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఆఫీసులో లేదంటే ఇంట్లో ఎక్కడైనా కానీ ఈ ప్రాంతం శాంతి,ఆనందం,శ్రేయస్సును సూచిస్తుందట. అదేవిధంగా అక్వేరియంలో చేపల సంఖ్యను కూడా గుర్తుంచుకోవాలట. ఎప్పుడూ కూడా అక్వేరియంలో తొమ్మిది చేపలు ఉండేలా చూసుకోవాలట.. తొమ్మిది చేపలలో ఎనిమిది చేపలు వేరువేరు రంగులు ఉండాలి. అవన్నీ ఒకే జాతికి చెందిన వై ఉండాలట. డ్రాగన్ ఫిష్ తప్పనిసరిగా 8వ చేప అయి ఉండాలట. గోల్డ్ షిఫ్ ఉంటే ఇంకా శుభప్రదంగా చెప్పుకోవచ్చట. ఈ తొమ్మిది చేపల లో ఏ ఒక్క చేప చనిపోయిన ఇంకో కొత్త చేప తెచ్చి అందులో రీప్లేస్మెంట్ చేయాలని చెబుతున్నారు.

అక్వేరియం ఇంట్లో ఉండడం వల్ల చేపలు ఈదుతున్నప్పుడు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందట. దాంతో ఇంట్లో ఉన్న వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుందట. చేపలు మంచి జీవశక్తికి ప్రతీక. అక్వేరియంలోని లోపల నీరు కూడా జీవితంలో మంచి శక్తి ప్రవాహాన్ని సూచిస్తుందట. వివిధ రంగులతో కూడిన చేపలు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని పెంచుతాయట. ఇవి ఒకరి విజయాన్ని, అదృష్టాన్ని పెంచుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో అక్వేరియం ఉంచితే ఇంట్లోని అన్ని వాస్తుదోషాలను పరిష్కరిస్తుందట. రంగు చేపలు వాటి పర్యావరణం నుండి ప్రతికూల శక్తిని మళ్లిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో అక్వేరియం పెట్టుకోవాలి అనుకున్న వారు ఈ విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి.

note : పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఈ పాటించడం అన్నది మీ వ్యక్తిగతం మాత్రమే.