Tulasi Vastu Tips : వాస్తు ప్రకారం ఇంట్లో ఏ తులసి మొక్కను నాటితే మంచిది. !!

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 05:27 AM IST

హిందూమతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం సరైన దిశలో ఈ మొక్కను నాటిన ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు తులసిని అన్ని పూజలలో, యాగాలలో ఉపయోగిస్తారు. ప్రధానంగా తులసి ఆకులను విష్ణువు పూజలో ముఖ్యమైనవిగా భావిస్తారు. అయితే తులసి మొక్కను ఇంట్లో నాటిన రోజు చాలా ముఖ్యమైంది. ఇంట్లో ఏ రకమైన తులసిని నాటడం మంచిది అనేది కూడా చాలా ముఖ్యం. తులసిలో అనేక రకాలు ఉన్నాయి. అయినప్పటికి గృహ పూజ, వాస్తు దోషాలను తొలగించేందుకు కొన్ని ప్రత్యేకమైన తులసి మొక్కలను నాటడం శుభప్రదంగా భావిస్తారు.

వాస్తు ప్రకారం ఇంటికి ఏ తులసి శుభప్రదం..!!
సాధారణంగా ఇంట్లో రెండు రకాల తులసి మొక్కలు నాటుతారు. రామతులసి, శ్యామ తులసి. వాస్తు నిపుణుల ప్రకారం రామ తులసిని ఇంట్లో నాటడానికి ఉత్తమమైందిగా భావిస్తారు. తులసి మొక్కలన్నింటిలో ఇది అత్యంత పవిత్రమైందిగా పరిగణిస్తారు. రామ తులసి లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రుచి కొద్దిగా తియ్యగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. శరీరం, మానసిక చికిత్సలో ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే రామతులసిని ఇంట్లో ఈశాన్య దిశలో నాటాలి.

శ్యామ తులసిని ఇంట్లో నాటవచ్చా?
శ్యామతులసి ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగు ఆకులను కలిగి ఉంటుంది. విష్ణువు రూపంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే శ్యామ తులసిని ఇంట్లో నాటుకోవచ్చు. కానీ పూజ కంటే ఔషదరూపంలో ఉపయోగించడం మంచిది.

తులసి మొక్కకు వాస్తు నియమాలు:
తులసి మొక్కను ఇంటి ప్రాంగణంలో చతురస్రాకారంలో నాటడం మంచిది. తులసి మొక్కకు ప్రతిరోజూ నీరుపోయడం, మంత్రాలను జపించడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుందని నమ్ముతుంటారు. తులసి మొక్కను ఇంటి లోపల నాటుకోవడం మంచిది. ఇంటికి బయట ఉంచకూడదు. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల సాక్షత్తు విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతుంటారు. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం మంచిది.