Pitrupaksha : చనిపోయిన మీ పెద్దల చిత్ర పటాలను వాస్తు రీత్యా ఇంట్లో ఏ దిక్కులో పెట్టాలో వెంటనే తెలుసుకోండి..!!

పితృ పక్షం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారికి శ్రద్ధ కర్మ, తర్పణ పద్దతి మొదలవుతుంది.

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 05:59 PM IST

పితృ పక్షం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారికి శ్రద్ధ కర్మ, తర్పణ పద్దతి మొదలవుతుంది. శాస్త్రాల ప్రకారం పితృ పక్షంలో పూర్వీకులకు శ్రాద్ధం చేస్తే వారి ఆత్మలు సంతోషిస్తాయని నమ్ముతుంటారు. పూర్వీకులకు శ్రాద్ధం చేస్తే…వారి దీవెనలు మనకు అందిస్తారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటే సంతోషం, ఐశ్వర్యం లభిస్తుంది. అయితే ఎవరికైతే పితృ దోషం ఉంటుందో వారిపై పూర్వీకులు కోపంగా ఉంటారు. దీంతో వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి, పితృ పక్షం సమయంలో కొన్ని చర్యలు తప్పకుండా చేయాలి. వీటి గురించి వాస్తుశాస్త్రంలో కొన్ని విషయాలు పేర్కొన్నారు. ఆ వాస్తు నియమాలు పాటిస్తే పూర్వీకులు సంతోషిస్తారట.

ఈ ప్రదేశంలో పూర్వీకుల చిత్ర పటాన్ని ఉంచకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం, పూర్వీకుల చిత్రాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. కాబట్టి, పూర్వీకుల చిత్రపటాన్ని పడకగదిలో, వంటగదిలో, పూజగదిలో పెట్టకూడదు. దేవుడి ఫొటో, పూర్వీకుల ఫొటోలను ఒకే స్థలంలో పెట్టకూడదు. ఇలా చేస్తే వారు ఆగ్రహిస్తారు. ఇంట్లో వివాదాలు మొదలవుతాయి.

ఈ ప్రదేశాలలో పూర్వీకుల చిత్రపటాన్ని ఉంచండి.
పూర్వీకుల చిత్రపటాన్ని ఎల్లప్పుడూ దక్షిణ దిశలో ఉంచాలి. ఎందుకంటే ఈ దిక్కు యమరాజుతో పాటు పూర్వీకులది.

పితృ పక్షానికి సంబంధించిన ఈ వాస్తు నియమాలను పాటించండి
వాస్తు శాస్త్రం ప్రకారం, పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, ఇంటి ప్రధాన తలుపును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి, ప్రతిరోజూ ఉదయం ప్రధాన తలుపులో నీరు పోయాలి.