Goddesses Lakshmi: ఇంట్లో స్త్రీలు ఇలా చేస్తే ఇల్లు లక్ష్మి నివాసంగా మారుతుందట!

సాధారణంగా పెద్దలు ఇంటికి దీపం ఇల్లాలు.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి.. ఇటువంటి మాటలను చెబుతూ

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 08:30 AM IST

సాధారణంగా పెద్దలు ఇంటికి దీపం ఇల్లాలు.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి.. ఇటువంటి మాటలను చెబుతూ ఉంటారు.అయితే పెద్దలు ఈ మాటలను ఊరికే చెప్పలేదు. ఇంటి ఇల్లాలు నడుచుకునే విధానం చూసే పనులపైనే ఇంటి మీద ఇంటి కుటుంబ సభ్యుల మీద ప్రభావం చూపుతుంది. ఇళ్ళు పరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుందట.nసూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది.

అలాగే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలంటే, సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుభ్రం చేయాలి. సూర్యోదయం తరువాత శుభ్రం చేయడం వల్ల ఇంటి పేదరికం కలుగుతుంది. అలాగేఇంటిని శుభ్ర పరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో పేదరికంతోపాటుగారు బాధలు కూడా తప్పవు. అలాగే కుటుంబ సభ్యులకు వంట చేయడం దేవునికి వండటం లాంటిదని అంటారు. అందువల్ల మహిళలు స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి.

దైవ ప్రార్థన చేసిన, నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. ఫుల్ గా లాంగించేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అలాగే సూర్యాస్తమయం అయ్యాక తల దువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి బాద్యులు అవుతాము. ఇంటి నైరుతి మూలలో ఈత కొలను లేదా నీటి సంపులు వంటి నీటి వనరులను నిర్మించవద్దు. ఇది ఇంట్లో పేదరికం మరియు వేదనకు కారణమవుతుంది. అలాగే డబ్బు పెట్టె లాకర్‌ను ఇంటి ఉత్తరం వైపు తెరిచి ఉంచండి. కుబేర చిత్రాన్ని నగదు పెట్టెలో ఉంచడం ఇంట్లో శ్రేయస్సుకు దారితీస్తుందని కూడా నమ్ముతారు.

ఇంట్లో ఎక్కువ సంపదను ఆకర్షించే మరో నిర్మాణ సమాచారం ఏమిటంటే నగదు పెట్టెను ప్రతిబింబించే విధంగా మీ నగదు పెట్టె ముందు అద్దం ఉంచడం. ఇలా చేయడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. మీరు మీ ఇంటి మొత్తాన్ని చక్కగా మరియు శుభ్రంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా, మీ ఇంటి ఈశాన్య మూలలో ఏ వస్తువులు చెల్లాచెదురుగా ఉండేలా జాగ్రత్త వహించండి. ఈ స్థలంలో మెట్లు నిర్మించకూడదు. కొన్ని ఇండోర్ ప్లాంట్లు మరియు మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇది ఇంట్లో సంపద ప్రవాహాన్ని స్థిరీకరిస్తుందని మరియు పేదరికాన్ని తగ్గిస్తుందని అంటారు.