Astro : శరీరంలో ఆ పార్ట్ పై బల్లి పడిందా, అయితే మీకు ధనయోగం ఖాయం..!!

శకునాలు రెండు రకాలు. 1 శుభం, 2 అశుభం. ఈ శకునాలు మీకు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడుల గురించి తెలియజేస్తాయి.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 09:00 AM IST

శకునాలు రెండు రకాలు. 1 శుభం, 2 అశుభం. ఈ శకునాలు మీకు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడుల గురించి తెలియజేస్తాయి. జ్యోతిష్యశాస్త్రంలో కూడా బల్లిగురించి పేర్కొన్నారు. బల్లి మనపై పడితే శుభ శకునాలతో అశుభ శకునాలు కూడా ఉన్నాయి. చాలా మంది బల్లిని చూసి భయపడుతుంటారు. కానీ బల్లి జీవితంలో సంతోషానికి శుభసంకేతాలను ఇస్తుంది. అయితే శరీరంలో ఏ భాగాలపై బల్లి పడితే శుభం కలుగుతుందో తెలుసుకుందాం.

ఆర్థిక లాభం:
బల్లి నుదిటిపై, కింది పెదవిపై, నాభిపై , రెండు తొడలపై, లేదా మోకాళ్ల మీద, పాదాల మధ్య పడినట్లయితే అది శుభసూచికంగా పరిగణించబడింది. సంపదను తీసుకువస్తుంది. కనుబొమ్మలపై పడితే మీ సంపద నాశనం అవుతుందని అర్ధం.

శత్రువులు నాశనం:
బల్లి మీ మీద పడి…ఎడమ వైపుకు వెళ్తే..అది శుభ సంకేతంగా భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం మీకు డబ్బు కలుగుతుంది. మెడపై పడితే అది శత్రువుల నాశనానికి సంకేతం.

కుటుంబంలో కలహాలు:
ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బల్లి శబ్దం వింటే మీకు శుభసూచకం. ఇది సంపదను తెలుస్తుందని నమ్ముతారు. బల్లి ఛాతికి ఎడమ వైపు పడితే కుటుంబంలో కలహాలు మొదలవుతాయి.

ఉద్యోగ ప్రమోషన్:
మీరు బయటకు వెళ్తుండగా తూర్పు, ఉత్తర దిశలలో బల్లి శబ్దం వినపడితే..మీకు శుభసూచకం. డబ్బుతోపాటు, ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.

వ్యాపారంలో పురోగతి:
తూర్పు దిక్కున బల్లి శబ్దం వినిపిస్తే..మీకు వ్యాపారంలో పురోగతి లభిస్తుందని అర్థం. ఎడమ భుజంపై బల్లి పడితే మీకు శత్రువులు పెరుగతారని అర్థం.

మంచి సంకేతం:
శకున శాస్త్రం ప్రకారం రాత్రం భోజనం చేస్తున్నప్పుడు ఈశాన్యదిశలో బల్లి శబ్దం వినబడితే అది శుభప్రదం.