Site icon HashtagU Telugu

Garuda Purana: చనిపోయిన వ్యక్తికి సంబందించి ఆ మూడు వస్తువులు ఏమౌతుందంటే?

Garuda Purana

Garuda Purana

భూమిపై జన్మించిన ప్రతి ఒక్క జీవరాశి ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే. మనుషులు కూడా ఏదో ఒక రోజు చావుకి తల వంచాల్సిందే. మరణాన్ని అడ్డుకోవ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అయితే మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది..? లేదా మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందనే దానిపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. హిందూ మత గ్రంథమైన గరుడ పురాణంలో మరణం గురించి స‌మ‌గ్రంగా వివరించారు. మరి ఈ విషయం గురించి గ్రంథం ఏ విధంగా స్పందిచిందో ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…మరణించిన వ్య‌క్తి ఆత్మ కదలిక గురించి మనం ఎవరిని అడిగినా, మనకు భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. హిందూ మతంలో కూడా దీని గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి.

సాధారణంగా, కుటుంబ సభ్యుల మరణం తర్వాత, వారి వస్తువులను జ్ఞాప‌కంగా, గుర్తుగా ఉపయోగిస్తారు, అయితే కొందరు మరణించిన వారి వస్తువులను నాశనం చేస్తారు. గరుడ పురాణంలో.. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తావించారు. మృతి చెందిన వారికి సంబంధించిన వ‌స్తువుల‌ను మనం తప్పుగా ఉపయోగించకూడదు. ఇది చనిపోయిన వారి ఆత్మను ఆకర్షిస్తుంది. ఫ‌లితంగా ఇంట్లో ప్రతికూలతను వ్యాప్తి చేస్తుందని నమ్ముతారు. ప్రతి వ్యక్తికి తాను ధ‌రించే ఆభరణాల పట్ల ఎంతో అనుబంధం ఉంటుంది. ఇది చనిపోయిన వ్యక్తి ఆత్మకు కూడా వర్తిస్తుంది. గరుడ పురాణం ప్రకారం, మరణించిన వ్యక్తికి సంబంధించిన‌ నగలు ధరించకూడదు.

వాటిని ధ‌రిస్తే మరణించిన వ్యక్తి శక్తి లేదా ఆత్మ అతని ఆభరణాలను ధరించిన వ్యక్తిని ఆవ‌హిస్తుంది. అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నుకుంటే మీరు వారి ఆభరణాలను ఉపయోగించాలనుకుంటే, ఆ నగలను క‌రిగించి, వాటితో కొత్త న‌గ‌లు చేయించుకుని ధరించండి. కొత్త నగలను తయారు చేయించుకుని మీరు ఉపయోగించవచ్చు. అయితే య‌ధాత‌థ స్థితిలో నగలు ధరించడం మానుకోవాలి. మరోవైపు, మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన ఆభరణాలను మీకు బహుమతిగా ఇస్తే, మీరు దానిని ఉపయోగించుకోవచ్చు, వాటిని పవిత్రంగా ఉంచవచ్చు. అలా కాకుండా మరణించిన వ్యక్తి వాడిన ఆభరణాలను ధరించి తప్పు చేయవద్దు గరుడ పురాణం ప్రకారం, మరణించిన తర్వాత కూడా, మరణించిన వ్యక్తి ఆత్మ ప్రాపంచిక అనుబంధాన్ని విడిచిపెట్టదు.

అటువంటి పరిస్థితిలో, మీరు వారి దుస్తులను ధరించడం వ‌ల్ల‌ వారి ఆత్మను ఆకర్షించవచ్చు. అందుకే చనిపోయిన వారి దుస్తులు ధరించడం మానుకోవాలి. కాగా గరుడ పురాణం ప్రకారం, కుటుంబ సభ్యుల మరణం తరువాత, వారి చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. చనిపోయినవారి సానుకూల, ప్రతికూల శక్తి వాచ్‌లో నివసిస్తుందని నమ్ముతారు. చనిపోయిన వారి చేతి గడియారాన్ని ధరించిన వ్యక్తి ప్రతికూల శక్తితో ప్రభావితమవుతాడు. ఫ‌లితంగా అతను చనిపోయిన వారి గురించి మళ్లీ మళ్లీ కలలు కంటాడు. ..

గరుడ పురాణంలో చెప్పినట్లుగా, మరణానంతరం మనం ఆ వ్యక్తితో ముడిపడి ఉన్న ఈ 3 వస్తువులను ఉపయోగించడం వల్ల మరణించిన ఆత్మకు విముక్తి లభించదు. ఆ వస్తువులను మళ్లీ మళ్లీ తమ సొంతం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. పైన పేర్కొన్న‌ 3 విషయాలు మాత్రమే కాదు. చనిపోయిన వ్యక్తి ఎక్కువగా ఇష్టపడే వాటిని మనం ఉపయోగించకూడదు.