పూర్వం మన పెద్దలు పురాణాల్లో చెప్పిన ఎన్నో రకాల విషయాలను తూచా తప్పకుండా పాటించేవారు. పురాణాల్లో ఎన్నో విలువైన విషయాలు వాస్తవాలు దాగున్నాయని అందుకే వాటిని ఫాలో అవ్వాలని ఇప్పటికీ మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుత జనరేషన్ వారు ఆ విషయాలను కొట్టి పరేయడంతో పాటు వాటిని మూఢనమ్మకాలుగా తీసిపారేస్తూ ఉంటారు. ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కడుపునిండా మూడు పూటలా భోజనం చేయడం కోసం నాన్న అవస్థలు పడుతున్నారు. డబ్బులు సంపాదించడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధ వహించడం లేదు. మీరు తీసుకునే భోజనం సరిగ్గా లేకపోతే మీరు అనారోగ్యం బారిన పడుతుంది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం దేవుడితో సమానమని, దాన్ని ఊరికే వ్రుథా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భోజనం చేసే సమయంలో మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు పొరపాటున ఈ ఆహారాన్ని తినకూడదు. ఇంతకీ ఆ ఆహారం ఏంటి అన్న విషయానికి వస్తే.. ధర్మ శాస్త్రం ప్రకారం, మనం భోజనం చేసే సమయంలో ఎవరైనా మీరు భోజనం చేసే ప్లేటు నుండి దాటితే పొరపాటున కూడా ఆ ఆహారాన్ని తినకూడదట. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే పాపం వస్తుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మరచిపోవద్దు. ఒకవేళ మీరు అలాంటి ఆహారం తీసుకుంటే, అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.
అదేవిధంగా మీరు ఆహారం చేస్తున్నప్పుడు ఆహారంలో బల్లి లేదా ఇతర చిన్న చిన్న కీటకాలు పడినా కూడా పొరపాటున అలాంటి ఆహారాన్ని తినకూడదట. అలాంటి భోజనం చేయడం వల్ల మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు శాస్త్రాల ప్రకారం మీకు దరిద్రం కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే వంట చేసే సమయంలో, భోజనం చేసే సమయంలో అంతా పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంపై గొడవలు జరగడం సహజమే. అయితే ఇలాంటి సమయంలో ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలని అనిపించదు.
కాబట్టి ఇలాంటి సమయంలో అన్నం తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే అలాంటి సమయంలో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. అంతేకాదు మీరు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందట. కాబట్టి వండేవారు, భోజనం చేసే వారు మనస్సు పెట్టి చేయాలి. మనలో చాలా మందికి వెంట్రుకలు సాధారణంగానే ఊడిపోతూ ఉంటాయి. పాకశాస్త్రం ప్రకారం, భోజనంలో వెంట్రుకలు వస్తే ఆ ఇంట్లో రోగాలు ఎక్కువ అవుతాయట. చాలా మంది ఆహారంలో వెంట్రుకలు వస్తే వాటిని తీసేసి మిగిలిన దాన్ని తినేస్తుంటారు. అయితే అలా వెంట్రుకలు కనిపించినప్పుడు వాటిని తీసేసి తినడానికి బదులు ఆ భోజనాన్ని జంతువులకు వేయడం మంచిదట. శాస్త్రాల ప్రకారం అలాంటి భోజనం చేయడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా వస్తాయని పండితులు చెబుతున్నారు.
మీరు తినే ఆహారంలో ఎవరైనా ఉమ్మి వేసినా లేదా పొరపాటున ఉమ్ము పడినా అలాంటి భోజనాన్ని అస్సలు తినకూడదట. అలాంటి భోజనం తినడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుందట. అంతేకాకుండా మీరు కలత చెందుతారట. మీరు భోజనం చేసే సమయంలో, శునకాలు మీ దగ్గర్లో ఉంటే, వాటికి కూడా తినిపించాలట. ఎందుకంటే శునకాలను యమధర్మరాజు దూతగా భావిస్తారు. ఒకవేళ కుక్కలకు అన్నం పెట్టకుండా తింటే, మీ ఆయుషు తగ్గిపోతుందట. అంతేకాదు అనారోగ్యం బారిన పడతారు. కాబట్టి వీలైనంత వరకు శునకాలు కనిపిస్తే వాటికి తప్పకుండా తినిపించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. లేదంటే జీవితంలో ఇబ్బందులు తప్పవట.
note: ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.