Site icon HashtagU Telugu

Power Politics: చాణక్య నీతి: అధికారంలోకి రావాలంటే ఆ ఒక్క పని చెయ్యాల్సిందే!

Chanakya Niti

Chanakya Niti

కౌటిల్యుడు మహోన్నత మానవతా కాబట్టి ఆయన రచించిన అర్ధశాస్త్రాన్ని చాణక్య నీతి శాస్త్రంగా పేర్కొంటారు. ఇందులో ఆర్ధిక అంశాలు, ఆదాయ వ్యయాలు, రాజనీతి, ప్రజా సంక్షేమం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు, వ్యాపార వాణిజ్య విషయాలు, యుద్ధ తంత్రాల గురించి తెలిపాడు. అలాగే రాజ్యాన్ని పాలించే రాజు ఉండాలో ఇందులో పేర్కొన్నారు. అర్ధ శాస్త్రం అంటే రాజకీయ యదార్థ శాస్త్రమని, ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియ జేస్తూ, ఎలా పని చేయాలో సూచించి, రాజు విధులను తెలియజేస్తుంది.

ప్రజలకు పాలన దగ్గరకావాలని చెప్పిన ఆయన ప్రజలే రాజ్య నిర్మాతలని తెలిపార. అయితే చాణక్య నీతి అధికారంలోకి రావాలి అంటే అణచివేతకు గురైన వర్గాలలో ఆశలు రేకెత్తించాలని, భయపడుతున్న వారిని మరింత భయపెట్టాలని పేర్కొన్నారు. అలాగే అత్యాశతో ఉన్నవారికి లాభాలతో ఎరవేయాలని, అప్పటికే అధికారంలో ఉన్న నాయకులను పదవిలో నుంచి దించేయాలంటే ఆయన చుట్టూ ఉన్నవారిని కొనేయాలని తెలిపారు. కానీ చుట్టూ ఉన్నవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి కదలికలు, నడతలో తేడాలను గమనించాలి అని తెలిపారు.

అయితే ఒకవేళ ప్రత్యర్థి బలంగా ఉంటే అంతకంటే శక్తవంతమైన వారితో జతకట్టాలని, ఇద్దరూ సమ ఉజ్జీలైతే వారిలో వారికి విభేదాలు సృష్టించి బలహీనపడిన వాడిని గుప్పిట్లో ఉంచుకోవాలి అని చెప్పి బలవంతుడైనా ఓ పట్టాన లొంగని వారితో స్నేహం చేయాలని, అనితర సాధ్యమైన పనులు శక్తిమంతులతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అలాగే మంత్రి మండలిలో మిత్రులను, గుట్టు తెలిసినవారిని చేర్చుకోరాదని సూచించారు. పాలకుడు ప్రజలను ఆకారణంగా దండిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ప్రజాభీష్టం ప్రకారం పరిపాలించినప్పుడు ఆదరణ లభిస్తుందని తెలిపారు. విదేశీయులు పరిపాలిస్తే ధనం వారి దేశానికి తరలించుకుని పోతారు కాబట్టి మంత్రులు, ఉన్నతాధికారులుగా విదేశీయులకు అవకాశం ఇవ్వరాదని తెలిపారు.

Exit mobile version