Calendar Vaastu : క్యాలెండర్ వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశలో పెట్టాలంటే..!

క్యాలెండర్ ని ఇంట్లో ఎక్కడంటే అక్కడ తగిలించకూడదంటారు వాస్తు (Vaastu) నిపుణులు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే

2022 కి గుడ్ చెప్పేసి 2023 కి వెల్ కమ్ చెప్పే క్షణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాదిలో జరిగిన మంచిని కొనసాగాలని, చెడు పాత ఏడాదికే పరిమితం కావాలని ఇష్టదైవాలను ప్రార్థిస్తారంతా. అదేసమయంలో పాత క్యాలెండర్లు తీసేసి కొత్త క్యాలెండర్లు పెట్టుకుంటారు. క్యాలెండర్ (Calendar) అనేది ఒక వ్యక్తి రోజువారీ పురోగతిని సూచిస్తుంది. కొన్ని క్యాలెండర్లలో సీనరీస్ ఉంటే, మరికొన్నింటిలో దేవుడి ఫొటోలుంటాయి, ఇంకొన్ని క్యాలెండర్స్ లో రకరకాల ఫొటోలుంటాయి. అయితే క్యాలెండర్ ని ఇంట్లో ఎక్కడంటే అక్కడ తగిలించకూడదంటారు వాస్తు నిపుణులు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే గడియారానికి ఎలాంటి నియమాలు వర్తిస్తాయో క్యాలెండర్ (Calendar) కి కూడా అలాంటి నియమాలే పాటించాలంటారు. తప్పు దిశలో క్యాలెండర్ పెడితే ఇంటిపై ప్రతికూల ప్రభావాలుంటాయని చెబుతారు. 

క్యాలెండర్ (Calendar) ఇంట్లో ఎక్కడు ఉండాలి – ఎక్కడ ఉండకూడదు:

  • వాల్ క్లాక్ ని తూర్పు, ఉత్తర దిశల్లో పెడతారు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఉంచరు..ఎందుకంటే అది యముడి స్థానం.
  • దక్షిణ దిక్కున వాల్ క్లాక్ పెడితే ఆ ఇంట్లో ఎవరో ఒకరు నిత్యం అనారోగ్యంతో బాధపడతారని చెబుతారు వాస్తునిపుణులు. అలాగే దక్షిణం వైపు క్యాలెండర్ పెడితే వ్యతిరేక శక్తులను ఆకర్షిస్తుంది , ఇంట్లో వారి పురోగతిని అడ్డుకుంటుంది
  • తూర్పు దిశగా క్యాలెండర్ పెడితే సంపద పెరుగుతుంది. ఈ దిశలో పెడితే ఆ ఇంట్లో వ్యక్తి కెరీర్ పరంగా వెలుగుతారు. ఈ దిశలో గులాబీ, ఎరుపు రంగుల క్యాలెండర్‌ను వేలాడదీయండి.
  • ఇంట్లో పశ్చిమ దిశగా క్యాలెండర్ పెడితే అనుకున్న పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతి ఉంటుంది
  • ఉత్తర దిశగా క్యాలెండర్ పెట్టిన ఇంట్లో ఆనందం ఉంటుంది.
  • జలపాతాలు, ఫౌంటెన్ వాంటి ఫొటోస్ ఉన్న క్యాలెండర్లు ఉత్తరం వైపు గోడకు తగిలించాలి
  • క్యాలెండర్ మీద అడవులు, మొక్కలు, పూలు ఉంటే దానిని తూర్పు దిశగా ఉంచడం మంచిది
  • ఓంకారం, స్వస్తిక్, ఇంద్రధనస్సు, ఉదయించే సూర్యుడి ఫొటోలున్న క్యాలెండర్లు తూర్పు గోడకు పెట్టాలి
  • క్యాలెండర్‌ను ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయకూడదు..ఇది ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తుంది
  • కొందరు తలుపుల వెనుక పెడతారు..ఇది కూడా సరికాదంటారు వాస్తు నిపుణులు
  • క్యాలెండర్‌లో యుద్ధం,ఎండిన చెట్టు, విచారకరమైన ఫొటోలు, క్రూర మృగాల ఫొటోలు ఉండకూడుదు.. ఇవి ఉండడం వల్ల కుటుంబంలో కలహవాతావరణం నెలకొంటుంది
  • మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొత్త క్యాలెండర్‌ను పాత క్యాలెండర్‌పై పెట్టేసే అలవాటు చాలామందికి ఉంటుంది.. ఇలా అస్సలు చేయొద్దు..ఇంట్లో అంతర్గత తగాదాలకు ఇదో కారణం అవుతుంది
  • చిరిగిన క్యాలెండర్‌ ఇంట్లో వాస్తు దోషాన్ని పెంచుతుంది
  • వాస్తు ప్రకారం ఆకుపచ్చ, నీలం, తెలుపు, గులాబీ, నీలం , ఎరుపు రంగులున్న క్యాలెండర్లు శుభప్రదం

Also Read:  Dwadasa Jyotirlingam : ద్వాదశ జోతిర్లింగాలు ఎవరి పేర్లపై ఏర్పడ్డాయి?