Astrology: ఆ 9 చెట్లకు నవగ్రహ దోషాలను తొలగించే శక్తి ఉందని మీకు తెలుసా.. అవేంటంటే?

నవగ్రహ దోషాలను తొలగించడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల నివారణలు పరిహారాలు చెప్పబడ్డాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తొమ్మిది

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 03:45 PM IST

నవగ్రహ దోషాలను తొలగించడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల నివారణలు పరిహారాలు చెప్పబడ్డాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తొమ్మిది రకాల చెట్లు నవగ్రహాల దోషాలను తొలగిస్తాయట. ఆ చెట్లను పూజించడం వల్ల నవగ్రహాలకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయట. ఇంతకీ ఆ చెట్లు ఏవి? ఆ చెట్లను పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సూర్య దోషం ఉన్నవారు జిల్లేడు మొక్కను పూజించాలి. సూర్యుడు, రాహువు,కేతువు, శని పీడీతులు పితృ దోషం ఉన్నవారు జిల్లేడు మొక్కను పూజించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ముఖ్యంగా ఆదివారం రోజు జిల్లేడు మొక్కను పూజించడంతోపాటు సూర్య భగవానుడి బీజ మంత్రాన్ని జపించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

మీ జాతకంలో చంద్రదోషం ఉంటే మీరు మోదుగ వృక్షాన్ని పూజించాలి. అలాగే దుష్టశక్తులతో బాధపడుతున్న వారు కూడా మోదుగ వృక్షాన్ని పూజించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే రోజు శివుడికి నీరు సమర్పించాలి. మోదుగ చెట్లను పూజించడం వల్ల ఆ బాధలు దూరం అవుతాయి.

మంగళ దోషము ఉన్నవారు మర్రి చెట్టుని పూజించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా 11 మంగళవారాలు ఈ చెట్టు వేర్లకు నీరు సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

బుధ దోషం ఉన్నవారు ఉత్తరేణి మొక్కను పూజించడం వల్ల ఆ అపాయం నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు ఈ చెట్టును పూజించిన తర్వాత బుధ గ్రహ బీజ మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.

అలాగే గురు దోషం ఉన్నవారు రావి చెట్టుని పూజించాలి. గురుదోషం ఉన్నవారు రావి చెట్టును పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. రావి చెట్టుకు నీరు పోసి ఐదు ప్రదిక్షణలు చేస్తే చాలా మంచిది.

శుక్ర గ్రహం దోషంతో బాధపడుతున్న వారు మేడి చెట్టుని పూజించాలి. కాగా శుక్రుడికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే లేదా దుష్ట గ్రహాలతో సంబంధం కలిగి ఉంటే అది దోషం అవుతుంది. కాబట్టి మేడి చెట్టుని పూజించడంతోపాటు శుక్రుని మంత్రాన్ని 90 రోజులు జపించాలి.

శని దోషం ఉన్నవారు శమి చెట్టిని పూజించాలి. మీ జాతకంలో శని దోషాలు ఉంటే, మీ జీవితం కష్టంగా ఉంటే, ప్రతిరోజూ జమ్మీ మొక్కను పూజించి, సేవించాలి. ఇలా చేయడం వల్ల శని వల్ల కలిగే బాధల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా శనివారం నాడు రావి చెట్టు కింద తప్పనిసరిగా దీపం వెలిగించాలి.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు దోషము ఉన్నవారు దర్భను పూజించాలి. జాతకంలో రాహువు బలహీనంగా ఉన్నట్లయితే లేదా శని, సూర్యునితో ఉన్నట్లయితే, అప్పుడు దర్భను పూజించాలి..ప్రతి రోజు దర్భ మూలాలలో నీరు పోయాలి. అలాగే రాహువు బీజ మంత్రాన్ని జపించాలి.

కేతు దోషం ఉన్నవారు దుర్వారాధన మొక్కను పూజించాలి. దూర్వ మొక్కను పూజించడం వలన కేతు దోషం తొలగిపోతుంది.