Site icon HashtagU Telugu

Nails Cut: గోర్లు ఏ రోజు కత్తిరించుకోవాలి.. ఆదివారం ఎందుకు కట్టించకూడదో తెలుసా?

Yellow Nails

Nails Cut

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు, మానసిక సమస్యలకు కారణం అవ్వవచ్చు. అటువంటి వాటిలో గోర్లు కత్తిరించడం కూడా ఒకటి. గోళ్లు ఏ రోజు తీసుకోవాలి అనే దానికి కూడా వాటిలో రూల్స్ ఉన్నాయి. దానికి కూడా ఫలానా రోజు అనేది ఉంటుందా అంటే ఉంటుంది అంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా ఆదివారం సెలవు ఉంటుంది. కాబట్టి ఆ రోజు గోళ్లు తీసేసుకుందాం అని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణులు ఆదివారం తియ్యవద్దు అంటున్నారు. ఆ రోజు తీస్తే దరిద్రం చుట్టుకుంటుందట.

ఆర్థిక కష్టాలు తప్పవని అంటున్నారు. గోర్లు కత్తిరించుకోవడానికి సోమవారం చాలా బాగుంటుందట. ఆ రోజు గోళ్లు తీసేసుకుంటే శుభవార్తలు వింటారనీ పెద్దల నుంచి గుడ్ న్యూస్ వస్తుందని అంటున్నారు. అలాగే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు తియ్యవద్దు అంటున్నారు. ఆ రోజు గనక తీస్తే చాలా చిక్కులు తప్పవనీ, జీవితం సవాళ్ల మయంగా మారుతుందని అంటున్నారు. బుధవారం గోళ్లు తీసుకోవడానికి సరైన రోజు అని చెబుతున్నారు. ఆ రోజు గోళ్లు తీసేస్తే.. ప్రశాంతత కలుగుతుందనీ, మనస్శాంతి ఉంటుందట. గురువారం కొన్ని మంచి సంకేతాలు వచ్చే రోజు కావడం వల్ల ఆ రోజు గోళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది అంటున్నారు.

శుక్రవారం గోళ్లు అస్సలు తియ్యవద్దు అంటున్నారు. ఆ రోజు గనుక తీస్తే అనారోగ్యాలు రావడంతో పాటు శత్రువుల పీడలు తప్పవట. శనివారం గోళ్ల జోలికి అస్సలు వెళ్లవద్దు. ఒకవేల ఆ రోజు గోర్లు కత్తిరిస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అంటున్నారు. అలా మొత్తంగా చూసుకుంటే గోర్లు కత్తిరించడానికి సోమవారం, బుధవారం మంచి రోజులు అని చెప్పవచ్చు. అలాగే గోర్లను కొరకడం అన్నది కూడా మంచి అలవాటు కాదు.

Exit mobile version